చిరంజీవి డాన్సులు చూసి, నేర్చుకున్నాము!!!

నేను మా తమ్ముడు, ఇద్దరూ చిరు ఫాన్సు. దాదాపు 1988 వరకు, డాన్స్ అంటే నాకు, మా తమ్ముడికి అంత టచ్ లేదు.

డాడి, అమ్మ, నేను, మా తమ్ముడు ప్రతి వారం ఆదివారం రొజు ఫస్ట్ షొ సినిమాకు ఇంటి నుంచి తియేటర్ కి బజాజ్ స్కూటర్ లో వెళ్ళే వాళ్ళం.

చిరు సినిమా రిలీస్ ఐతె ఇక చెప్పనవసరం లేదు, చిరు సినిమాకే పోవాలని అల్లరి చేసే అవకాసం మా అమ్మ నాన్న మాకు ఇచ్చే వాళ్ళు కాదు.ఎందుకంటే వాళ్ళ వోట్లు కూడా చిరు సినిమాకే.

యముడికి మొగుడు సినిమా లో, యమలోకంలో వుండే ‘నో నో నాట్యమిదా..’ పాటకు మన ‘చిరూ అంబికా తో చెసే డిస్కొ నాట్యం  ను చూసి మొదలయ్యింది డాన్స్ పైన ఇంట్రెస్ట్.

నాకు తెలిసి చిరు ఒక కొత్త ట్రెండ్ ని ఈ సినిమా నుంచే మొదలెట్టాడనుకుంటా. సినిమా హీరొయిన్ల తో కాకుండా సొలొ కాని వాంప్ తో కాని స్పెషల్ అపియరెన్స్ హెరొయిన్ తొ కాని స్పెషల్ స్టెప్పులతో ఒక పాట ఉండటం.

ఇది మొదలు దాదాపు గా ప్రతి సినిమాలోను అలాంటి పాటలుంటాయి.

మరణమౄదంగం లో ఉన్న ‘చక్కు బుక్కురు చక్కు బుక్కురు చక్…జిం జిం జిం ఏ జంగిలి జిమజిమ… పాట మధ్యలో 10 సెకన్లు  ఒట్టి మ్యూజిక్ ఉండి బాక్ గ్రౌండ్ నీళ్ళలో బాంబులు పెలుతుంటే మన చిరు మరియు రాధా మాంచి స్టెప్పులు వేస్తారు. 20 ఏండ్ల ముందు థియేటర్ లో చూసిన ఇలాంటి స్టెప్పులు, మ్యూజిక్ ఇంకా నా మదిలో మెదులుతూనే ఉన్నాయి.

ఇలాగే స్టేట్ రౌడి లో ‘వన్ టూ త్రీ ఫోర్ ఫోర్ ఫోర్ బ్రేక్ బ్రేక్ బ్రేక్ డాన్స్ డాన్స్…జత కుదిరే ఇద్దరికీ…..’ ఈ పాట మధ్యలో కూడా 10 సెకన్లు సైలెంటు ఐపోయి కాఫీ తాగినట్లు ఆక్టింగ్ చెసి ఒక్కసారిగా మ్యూజిక్ తో పాటూ డాన్స్ స్ స్టార్ట్ అవ్వుద్ది. చిరు తొ పాటూ రాధ ఇలాంటి డాన్సుల్లొ బలె జొడీ. ‘రాధ రాధ మదిలో నా మన్మధ బాధ…’ పాటలో కూద స్టెప్పులు అదుర్స్.

కొండవీటి దొంగ లో రెండు పాటలు ఒకటి ‘శుభలేఖ రాసుకున్న యదలో ఎపుడో…’ – ఈ పాటలో (ఇద్దరూ తెలుపు, ఆకు పచ్చ రంగులున్న డ్రస్సులు వేసుకొని ఉంటరు. బ్యాగి పాంటు, టి-షర్ట్ చిరు వేసుకొనుంటాడు.అప్పుడు బ్యాగి పాంటు ఫేమస్ కదా!! రాధ ఆకు పచ్చ, తెలుపు కాంబినాషన్లో ఉందే స్కిర్టు వేసుకొనుంటాది) కాండిల్స్ మధ్యలో చిరు, రాధ ఒట్టి మ్యూజిక్కుకు, పిడికిళ్ళు బిగించి వారి వారి చెతులు వాళ్ళ చెస్ట్ దగ్గర పెట్టుకుని ఒక్కాలు ముందుకి, ఒక్కాలు  వెనక్కి రెండు మూడు సార్లు వెసే స్టెప్పులు స్పెషల్ స్టెప్పులు.  ఇంకొకటి ‘చమకు చమకు చాం పట్టుకో పట్టుకో చాన్సు దొరికరొ హొయ్యా…’. ఈ పాట మధ్యలో మ్యూజిక్కంతా సైలెంట్ ఐపోయి మన చిరు కుడి జెబులోంచి రుమాలు తీసి చెమట తుడుచుకొని ఎడమ జెబులో పెడతాడు.సూపర్ స్టైలు గా ఉంటాది ఈ స్టెప్పు.

గ్యాంగ్ లీడర్ గురించి ఇంక చెప్ప్ప నవసరం లేదు.ప్రతి పాటా ఒక దాన్ని మించి ఒకటి. తెల్లటి డ్రస్సులో టైటిల్ సాంగుకు చిరు వేసే స్టెప్పులతొ ఉర్రూతలూగించాడు. ‘వాన వానా వెల్లువాయే…’ పాట ఎమని వర్ణించనూ. చిరు నల్ల డ్రస్సు, తెల్ల షూసు, 2 తెల్ల బెల్టులు, విజయ శాంతి నల్ల చీర, మెడలో వెరైటిగా ఉన్న ముల్లులుముల్లులు ఉండే  చెయిను, ఫ్రీగా వదిలేసిన తన హెయిరు, బాక్ గ్రౌండ్లో వచ్చే ఆ ఫ్రెష్ పొగలో ‘ఎదొ ఎదొ ఎదొ హాయి….’ అనే చరణం అవ్వగానే వచ్చే మ్యుజిక్ కి సూపర్ స్టెప్పులుంటాయి.

జగదేకవీరుడు అతిలోకసుందరి లో “చిరు” తెల్లటి బాగి పాంటు, శ్రీదేవి తెల్లటి చొలీ గాగ్రా వెస్కొని  ‘అబ్బ నీ తీయనీ దెబ్బ..ఎంత కమ్మగా ఉందిరోయబ్బ..’ పాటకు సింపుల్ స్టెప్పులెస్తుంటే అబ్బబబ్బబబ్బ ఎంత బాగుందో!! ఇంకా గుర్థుంది, సినిమా లో ఈపాట వచ్చెటప్పుదు చిరు, శ్రీదేవి లను ఫొటొలు తీసుకున్నారు.అంత అందంగా ఉన్నారు ఈ పాటలో ఈ పేయిర్. డిజిటల్ కేమరలు వచ్చేకి ముందు ఇలా సినిమలో ఫొటొలు తీయడం ఇదొక్కసారే చూసాను.

రాజ విక్రమార్క లో ‘గగన కిరణ గమనమిదీ..’ పాటలో తలను వేరైటీగా వెనక్కు కదిలిస్తూ ఒక స్టెప్పుంది.సూపర్ స్టెప్పండి బాబూ…

రౌడీఅల్లుడు పాటలు బాసూ, ఎక్సలెంట్ పాటలూ, పాటలకి అంతకన్న ఎక్సలెంట్ స్టెప్పులు.’బొలొ బొలొ బొలొ రాణీ క్య చాహియే.. ప్యార్ చాహియే యా పైసా చాహియేఅ..’ పాటకి మాస్ స్టెప్పులే మాస్ స్టెప్పులు.స్పెషల్లీ చిరు ఖాకీ షర్ట్ చివర పట్టు కొని అడ్డంగా నిలువుగా మ్యూజిక్కుకు సరిగ్గా సరిపోయే విధంగా స్టెప్పులు ఇరగ తీస్తాడు.
‘లవ్ మీ మై హీరొ.. మజాగా ముద్దిస్తా రారో’ పాటలో మ్యూజిక్ అదురుద్ది.ఈ పటలో అమితంగా నచ్చేదెదంటే మ్యూజిక్ పండడానికి మ్యూజిక్ డైరెక్టర్ చాలా మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ ని క్రమబద్దంగా వాడాడు.
పాట మధ్యలో అంతా సిలెంట్ ఐపోయి ఫ్లూటు తో మొదలు అయ్యి, ఫ్లూటు రెండు సార్లు ఊదగానే, ఫ్లూటు తో పాతూ, సింగల్ స్టిక్ డ్రం బీట్ అందుకుంటుంది,వీటితో పాటూ మెల్లమెల్లగా డ్రంస్ అందుకుంటాయి. ఫ్లూటు తో మ్యూజిక్ మొదలైనప్పుడు మన చిరు కాళ్ళ పై కూచోని ఒక్కొక్క మ్యూజిక్ ఇన్స్ట్రుమెంత్ పెరిగే కొద్దీ మెల్లగా పక్కకు కదులుతూ పైకి లేస్తాడు. అదుర్సే అదుర్స్.
‘చిలుకా క్షేమమా..’ పాటకు క్లాస్ స్టెప్పులేస్తాడు.

ఘరానామొగుడు ‘బంగారు కోడి పెట్ట వచ్చెనండి..ఎ పాప ఎ పాప ఎ పాఆప..’పాటలో మ్యూజిక్కుకి కాళ్ళ పై కూచోని ముందుకు వెనక్కు కదులుతూ పైకి లేస్తాడు.అప్పటి వరకూ అలాంటి స్టెప్పు వీసింది చిరు ఒక్కడే!!
మిగతా అన్ని పాటలూ కూడా చక్కని మ్యూజిక్ తో అందరినే మాస్ ని క్లాస్ ని కలిపి ఎంటర్టైన్ చేస్తది. 

ముఠామేస్త్రి ‘ఈ పేటకు నేనే మేస్తిరీ..’ పాటలో పంచెని ఎడమ చేతి సంక కింద పెట్టుకొని, 75 డిగ్రీలు ఒంగి చేత్తో గాంధీ కర్రను పట్టుకున్నట్లు గాల్లో పట్టుకొని, వీపుని పైకీ కిందకి కదిలిస్తూ ముందుకు నడుస్తాడు. బలే ఉంటుంది ఈ స్టెప్పు.

ఇక్కడి వరకు వచ్చేసరికి నేను మా తమ్ముడికి మ్యూజిక్, డాన్స్ పైన ఎంత ఇంటరెస్ట్ వచ్చిందంటే ముఠమేస్త్రి చూసి ఇంటికి వచ్చిన తర్వాత నేను మా తమ్ముడు (నవీన్ గార్ల) ఆ స్టెప్పు గురించి డిస్కస్ చేసి, నేను చేస్తే తమ్ముడు చూసి, వాడు చేస్తే నేను చూసి ఒకర్నొకరు కరెక్ట్ చేసుకొని నేర్చుకొన్నాము.

నేను ఇంటర్ ఫస్ట్ ఇయర్ కాలేజ్ ఆనివర్సరి ఫన్షన్ కి గ్రూప్ తో ముఠామెస్త్రి టైటిల్ సాంగ్ కి డాన్స్ చెసే అవకాసం వచ్చింది.ఐదే రోజులున్నయి ప్రిపరేషన్ కి. డాన్స్ మాస్టర్ ని మాట్లాడు కొన్నాము. రోజుకు 2 గంటలు చెప్పే వాడు. మిగతా అంతా మేమే ప్రాక్టీస్ చెసుకున్నము. నేను చిరు, మిగతా వాళ్ళు గ్రూప్ డాన్సర్స్.డాన్స్ మాస్టారు నాకు కట్టి పట్టుకొని నడిచే స్టెప్పు బాగ వస్తాఉంది అన్నడు. చాల ఆనందం అయ్యింది. సినిమా చూసి వచ్చి నవీన్ తో దిస్కస్ చెసినందుకు ఆ స్టెప్పు కాన్ ఫిడెంట్ గా వచ్చింది. నేను డాన్స్ లో పాల్గొంటే, మా తమ్ముడు ఒక కామెడి డ్రామ లో ప్రధాన పాత్ర వేసాడు. నేను తమ్ముడు స్టేజి షొలు ఇస్తున్నము కాబట్టి అమ్మ నాన్నలు వచ్చరు. స్టేజి పైన మొదటి సారి ఐనందు వల్ల ఫస్టు ఒక నిముషము స్టెప్పులు వెయడానికి టెన్షన్ పడి అలా నిల్చొని ఉండిపోయాను. ఆడియన్స్ అందరూ ఒకటే అరుపులు. 75 డిగ్రీలు ఒంగి వేసే స్టెప్పు వేయడానికి మ్యూజిక్ రాగానే కరెక్ట్ గా వేసా.వేయగానే, విజిల్సే విజిల్సు. అక్కడి నుంచి ఊపందుకున్నా. హిట్టయ్యింది.

చిరు వేసే స్టెప్పులు చూసి చూసి పైన చెప్పిని స్టెప్పులన్నింటిని నేర్చుకున్నా. 

ఇలా నేర్చు కున్న డాన్స్ నాకు మా తమ్ముడికి రాగింగ్ లో బలే ఉపయొగ పడ్డాయి. మా సీనీర్స్ ని బలె ఇంప్రెస్స్ చేసాము.

బీ.టెక్ నేను, తమ్ముడు వేర్వేరు కాలేజీలలో చదివినా కూడ, కాలేజ్ డే ఫన్షన్ కి, హాస్టల్ డే ఫన్షన్ కి, ఫ్రెండ్స్ బర్తడేలకి బలే డాన్సులేసి బెష్ బెష్ అని పించుకున్నము.

తర్వాత యం.టెక్ సూరథ్కల్ ఆర్.ఈ.సి కాలేజి లో చదివేటప్పుడు 2000 సంవత్సరం ఆంద్రా ఫొర్మాషన్ డే కి ఒక హిందీ పాటకి నా సొంత కొరియొగ్రఫి తో స్టేజి పైన డాన్స్ చేసాను.డాన్స్ ఐపోయాక 4 క్లాస్ చదివే మా హెచ్.ఓ.డి గారి అమ్మయి నా దగ్గరకు వచ్చి మీరు చాల బాగ డాన్స్ చెసారు అనంగానే బలే ఆనందమయ్యింది.

జాబు లో చేరాక, 2003 లో లండన్ వచ్చాను.ఇక్కడ మా కంపని ఆనివర్సరి ఫన్షన్ లో నేను డాన్స్ చేస్తానని నన్నడగ కుండా మా ఫ్రెండ్ మురళి నా పేరు ఇచ్చేసాడు. మురళి ఎంకరేజ్మెంట్ వల్ల నేను చాలెంజ్ గా తీసుకొని శంకర్ దాదా యం. బి.బి.యస్ రిలీజ్ అవ్వక ముందే ‘ఏ జిల్లా ఏ జిల్లా..’  పాటకు వారం లో నే నే కొరెయొగ్రఫి చేసి డాన్స్ చేసా. అద్దిరి పోయింది. ఫస్ట్ టైం నా డాన్సుని ఫ్రెండ్ కేమర తో వీడియొ తీయించు కున్నా. డాన్స్ ఐపోయి మా టీం లీడర్ దగ్గరకు పోయి కొచుంటే ‘ఇక్కడ ఏం చేస్తున్నవ్, సినిమాలో చేరకుండా’ అని అన్నడు. బలే ఆనందం అయ్యింది. డాన్స్ మధ్య లో చాల అలిసిపోయా. ఆడియన్స్ ‘చీరూ చీరూ’ అని ఎంకరేజ్ చేస్తుంటే ఈ నొప్పులూ తెలవకుండా హాయిగా వెసేసాను డాన్సు.   

ఇలా డాన్సులు చేసే దాని వల్ల, నన్ను నా ఫ్రెండ్స్ అంతా ‘చిరూ ‘చిరూ అని అంటారు.

‘చిరూ ‘చిరూ  అని పిలిస్తే ఎవరికి మాత్రం ఆల్ హ్యపీస్ 🙂 కాదు చెప్పండి?

14 వ్యాఖ్యలు

ఇల్లు.. ఆఫీసు… ఇలా ఆల్ హ్యాపీసు!! ఏం అంటారూ?

‘మన రూటే సెపరేటు..’ అన్నట్టు పని దారి పనిదే.. కుటుంబ జీవితం దారి వేరే.. ఉంటే అంతా హాయి. కానీ చాలామంది రెండు బళ్లనీ వేర్వేరు పట్టాల మీద నడపలేరు. ఆఫీస్‌లో ఉన్నప్పుడు ఇంటి సమస్యలూ, కుటుంబంతో గడుపుతున్నప్పుడు ఆఫీస్ పనులూ.. గురించి ఆలోచిస్తూ మనశ్శాంతి లేకుండా చేసుకుంటారు. అలాకాకుండా ఉండాలంటే.. ఇదిగో ఈ చిట్కాలు పాటించి చూడండి!

– పని చేసేచోట మీరు బాస్ కావొచ్చు. ఇంట్లో కాదు! అలాగే, మనం మరొకరి కింద పనిచేసే ఉద్యోగులం కావొచ్చు. అలాగని ఇంట్లో ఒదిగి ఉండక్కర్లేదు.. అలాగే, అక్కడ చూపించలేని ప్రతాపాన్ని ఇక్కడ చూపించకూడదు. కుటుంబసభ్యుల్ని మనతో కలిపి ఉంచేవి అనురాగబంధాలు కానీ, జీతభత్యాలు కావు. ఇది గుర్తుంచుకుని, ప్రేమాభిమానాల్ని ఇచ్చిపుచ్చుకుంటే ఇంటికీ ఆఫీస్‌కీ విభజన రేఖ స్పష్టంగా ఉంటుంది.

– ‘పని చేస్తుంటే పగలూరాత్రీ తెలియదు..’ అనుకోవడం బావుంటుందేమో.. కానీ అత్యవసరమైతే తప్ప ఆఫీస్ వర్క్‌ని ఇంటికి తీసుకురాకూడదు. అలాగే రాత్రిపూటా, వారాంతాల్లోనూ పని చేయడం అలవాటుగా మార్చుకోకూడదు. అలాగే ఇంట్లో కంప్యూటర్ ఉంది కదాని, నెట్ చూడటం, ఆఫీస్‌కు సంబంధించిన పనుల్ని తెముల్చుకోవడం వద్దేవద్దు!

–  ఇంటికి చేరగానే, మీ భాగస్వామి ఆ రోజునెలా గడిపారో అడిగి తెలుసుకోండి.. ఏదో నిర్లిప్తంగానో, లేదా ఆరాలు తీస్తున్నట్టో కాదు! వాళ్లు చెప్పేది వినటం వల్ల మీలో ఆఫీస్ ఆలోచనలకు అడ్డుకట్ట పడుతుంది. పైగా, తమను పట్టించుకుంటారన్న భావన భాగస్వామిలో కలగడం ఓ ప్లస్ పాయింట్. (మన గురించి మనం మాట్లాడాలన్న తపన అందరికీ ఉండేదే. అయితే ఈ కాసేపు, మీగురించి చెప్పాలన్న వాంఛను అణుచుకోండి.)

– బాగా ఒత్తిడిగా ఉన్నప్పుడు, పనెక్కువ చేసిన తర్వాత, ఇంటికెళ్లడానికి ఎక్కువ దూరం, సమయం పట్టే మార్గాన్నెంచుకోవాలి. మొత్తం ప్రయాణం గంట పడుతుందనుకుంటే దాన్ని రెండు భాగాలుగా విభజించండి. ఒక సగంలో మర్నాడు చేయాల్సిన పనుల గురించి ఆలోచించండి. రెండో సగంలో పాటలు వినడం, లేదా మరేదైనా హాయినిచ్చే విషయాల గురించి అనుకోవాలి. దీనివల్ల లాభమేంటంటే ఇల్లు చేరేసరికి ఆఫీస్ ఆలోచనలు పూర్తిగా పక్కకు పోతాయి.

–  చాలామందికి ‘నేను లేకుంటే ఆఫీస్ నడవదు..’ అన్న ధోరణి ఉంటుంది. నమ్మండి, నమ్మకపోండి.. అది పూర్తిగా తప్పు! ఏ కార్యాలయమైనా ఒక్కరి మీదే ఆధారపడి పనిచేయదు. అందువల్ల సమయం మొత్తం ఆఫీస్ పనికే ధారపోయడం.. అవసరం లేదు!

– దూరాల్ని చెరిపెయ్యడంలో సెల్‌ఫోన్‌ది కీలక పాత్ర. సెల్ మన అవసరానికి ఉపయోగపడేదే తప్ప, అదే ప్రాణావసరం కాకూడదు. వారంలో రెండు మూడు రోజులు సాయంత్రం 5 నుంచి మర్నాడు 5 వరకూ సెల్‌ఫోన్ వాడటం మానెయ్యాలి. సైలెంట్‌లో పెట్టడం లేదా స్విచాఫ్ చెయ్యడం.. దీనివల్ల పని గురించి ఆలోచించే సమయం తగ్గుతుంది!

(ఈనాడు లోని ఈతరం నుండి సేకరణ)

6 వ్యాఖ్యలు

ఏస్కో డిస్కో!!!

ఏస్కో డిస్కో
ఈల ఈల
ఏస్కో ఏస్కో
ఈల ఈల
డిస్కో ఏస్కో

నేను లండన్ లో ఉన్నా కాబట్టి మాచ్ ఆఫీస్ టైంలో జరిగింది.ఇంటెర్నెట్ లో స్కోర్ బోర్డ్ రెఫ్రెష్ చేస్తూ చూస్తున్ననంతే. 

ఏం టెన్షన్ రా బాబు. ముక్క్యంగా చివరి 4 ఒవర్లు.

16 ఒవర్ల వరకు గెలుస్తాం అనుకున్నాను.మరుసటి ఒవర్లో 3 సిక్సులు.పద్దెనిమిదవ ఒవర్లో 2 సిక్సులు. ఇక టెన్షన్ తట్టుకోలేక స్కొర్ బోర్డ్ విండోస్ అన్నీ మూసేసా.

ఆగలేక పోయా..పది సెకన్ల తర్వాత మళ్ళీ స్కొర్ బోర్డ్ తీసా. చూస్తే వికెట్లు పడ్డాయి కానీ చివరి ఒవర్ కి 13 రన్లు కొట్టాలి అంతే.

ఒక సిక్సు పడింది..పడంగానే ఐపొయిందిరా అనుకోని చుట్టుపక్కల వారికి ఓడిపొయాం అని చెప్పేసా. 

స్కొర్ బోర్డ్ రెఫ్రెష్ చెస్తే 3 నిముషాలైనా రానే లేదు. కొంచు దూరంలో వున్నతను వికెట్ పదిందీ అని కొంచం గట్టిగా అరిచాడు..

ఒక్క సారిగా టెన్షన్ పోఇంది. ఇండియా వరల్డ్ కప్ ఫైనల్స్ లో 24 ఏండ్ల తర్వాత అదే పాకి పైన గెలిచింది..  బలే బలే బలే బలే బలే ఆనందం అయ్యింది.

ఆల్ హ్యపీస్.. 🙂 ఏమంటారూ?

https://gsashok.wordpress.com/2007/09/22/india_aus_20-20_2007_semifinals/

6 వ్యాఖ్యలు

నా సామిరంగా, ఏం మ్యాచ్ రా బాబూ!!!

నా గోళ్ళు కత్తరిచ్చు కోవడం రెండు వారాల్నుంచి వాయిదా వేస్తూనే వచ్చా.  

హమ్మయ్య ఈరోజు ఆపని జరిగిపోఇంది, మన ఇండియా ఆశ్ట్రేలియ  ‘నేయిల్ బైటింగ్ మాచ్’ దయతో.

నేను మా స్నేహితుడు, బలే ఎంజాయ్ చేసాం , ఏం మాచ్ రా బాబు!! ప్రతి వికెట్ కీ కేకలే కేకలు!!

వంట చేసుకుంటున్న మా ఫ్రెండ్ వాళ ఆవిడ పరిగెత్తుకుంటూ వచ్చి “ఏంటి చిన్న పిల్లల కంటే ఎక్కువగా అరుస్తున్నారు” అని అన్నారు, ఇక అర్థం చేసుకోండి ఎంత ఎంజాయ్ చేసామో!!

ఆల్ హ్యపీస్…

20 20 వరల్డ్ కప్, ఇండియా పాకి ఫైనల్స్ మాచ్ కి కాళ్ళ గొళ్ళే మిగిలాయి 😉

(ఉద్యొగపు పనిపైన ఒక నెల కోసం లండన్ వచ్చి మా స్నేహితునింట్లొ వున్నాలెండి)

6 వ్యాఖ్యలు

గుర్తుకొస్తున్నాయీ!!!

నేను అశోక్, మా తమ్ముడు నవీన్, మా పిన్నమ్మ కొడుకు శ్రీనాథ్,
చిన్నప్పుడు మేము ముగ్గురూ ఆడుకునే వాటిల్లో ఒకటి గుర్తుకొచ్చింది. అదేమిటంటే

శీకాయ, కారము, యముడు

అనే మూడు పదాల్ని ఒకదాని తర్వాత ఒకటి వ్రాసి నిలువుగా చదివినా అడ్డంగా చదివినా ఒకే అర్థం వస్తాయి.  

శీకాయ
కారము
యముడు

ఇలా మా ముగ్గురి పేర్లను వ్రాసి పై విధంగా చదివితే ఎలావుంటుందో చూడండి!! 

అశ్రీన, శోనావి, క్ థ్ న్…

ఇలా ముగ్గురూ ఒకే సారి చదివి బలే నవ్వుకునే వాళ్ళం. 🙂

అశోక్
శ్రీనాథ్
నవీన్

ఆల్ హ్యపీస్…

Comments (1)

కష్టాల్లో ఆదుకున్న ఇన్ ఫర్మేషన్!!!

కష్టం అని చూడగానే కంగారు పడ్డారా? ఇది పర్సనల్ లైఫ్ కి సంబందించింది కాదు.మన పనిలో వాడే యంత్రము “వొడిపైన” (laptop) / “లెక్కపెట్టే యంత్రము” (computer) కు 
సంబందించింది. ఇక ఊపిరి పీల్చుకోండి 🙂 .

చాలా పని ఉన్నందు వల్ల, నిన్నటిరోజు ఆఫీసుకి త్వరగా వచ్చాను. లాగిన్ అవుదామని username password ఇస్తె, లాగిన్ అవదే! నీ యెంకమ్మ, నిన్నటివరకు, ఈ  user details నే కద వాడాను, దీనికి ఇప్పుడేమైందిరా నాయనా, అనుకున్నా. 

ఒక పక్క పని వుంది, లాగిన్ అవలేక పోతున్నా… నేను అడ్మిన్ యూసర్ డీటేల్స్ వాడేదాని వల్ల, పుండు పైన కారం చల్లినంత పెద్దదయ్యింది ఈ ప్రొబ్లెం.అబ్బబ్బ, ఒక్క క్షణం కొంత చిరాకేసింది.   

చిరాకేస్తే ఏం ప్రయోజనం, మన కోసం టైం ఆగదు కదా! ఎప్పటికైన ఈ ప్రొబ్లెం సాల్వ్ చేయాల్సిందే.తప్పదు. సాల్వ్ చేస్తేనే పని జరుగుతాది.కాబట్టి, ఆ చిరాకుని క్షనంలో చేదిచ్చి సాల్వ్ చేయడం స్టార్ట్ చేసా.

అందరిలాగే నాకు కూడా మా కంపనీ,  టెక్మహీంద్ర, ఒక లపటప 🙂 (laptop) ఇచ్చింది.పని పైన ఒక నెల కొసం లండన్లో వున్న మా క్లయంట్ ఆఫీసుకు వచ్చాను.తెల్లవారి జామున తొందరగా వచ్చాను కాబట్టి, ఆఫీస్లో హెల్ప్ చేసేవారు ఎవ్వరూ లేరు.

సో,క్లయంట్ ఆఫీస్ నుంచి మా ఇండియ ఆఫీస్లో వున్న సిస్టం అడ్మినిస్ట్రేటర్ కి ఫోన్ చేసాను.

అతనికి తెల్సిన సొల్యూషన్స్ అన్నీ చేయమని చెపాడు.’temp’ యూసర్తో లాగిన్ అయ్యి,కంట్రొల్ పానెల్, యూసర్ అకౌంట్స్, మై కంప్యుటర్ అన్నిట్లోకి వెళ్ళి వాటి ప్రొపెర్టీసన్నిటినీ గెలికాము. ప్రయొజనం లేకపోయింది.

నెట్ మీటింగ్లోకి వెళ్తే చూస్తానన్నడు. కుదరలేదు. లాస్ట్ కి నా మేయిల్స్ వున్న పీయస్టీ ఫైల్ (pst file) కాపీ చేస్కోగలిగను.కానీ మైక్రొసాఫ్ట్ ఔట్లుక్ సెట్టింగ్ చేసుకోవాలి.నేను చూసుకుంటానులే అని మా అడ్మినిస్ట్రేటర్కి చెప్పి ఫోన్ పెట్టేసాను.    
 
నేను client ఆఫీస్లో వున్నాను కాబట్టి, నా  mails చూసుకూవాలంటే ఒక స్పెషల్ ఫైల్ డవున్లోడ్  చేసుకోవాలి.ఎందుకో అప్పుడు ఆలింకు పనిచేయలేదు.

ఇదంతా అయ్యేకొద్ది దాదాపుగా ఒకటిన్నర గంట పట్టింది.

వెంటనే మా స్నెహితుడు రాజ్ కి ఫోన్ చేసాను. చిటికలో నా ప్రొబ్లెం సాల్వ్ చేసాడండి. నా పాస్వర్డ్ తెచ్చుకోగలిగాను.  రాజ్, యు ఆర్ ఎ సూపర్ బాయ్!! మీ సొల్యుషన్ పనిచేసిండి అని మేఇల్ చేసాను. ఆల్ హాపీస్… 

ఆ టెక్నిక్ ఏమంటే, వారానికి లేదా పదిహేను రూజులకు ఒక సారి “system restore point” క్రియేట్ చెసుకుంటె చాలా ఉపయోగపదుతుంది. ఇంత మాంచి option ఇచ్చాడు మైక్రొసాఫ్ట్ వాడు!! ఏంటి నమ్మరా?  🙂 ఐతే మీ ఇష్టం, నాకైతే చాలా బాగా పనిచేసింది. నమ్మినవాళ్ళు కింద ఇచ్చిన సూచనలు ప్రకారం చెస్తే, ఇలాంటి కష్టం ఎప్పుడు వచ్చినా, చాలా తేలికగా సాల్వ్ చేసుకోవచ్చు.
start > All Programs > Accessaries > System Tools > System Restore > you get 3 options (i) Restore my computer to an earlier time (ii) Create a Restore point (iii) Undo my last restore point.

ఫస్టు, Create a Restore Point ను సెలెక్ట్ చెసుకొని, ఒక పెరు ఇచ్చి నెక్స్ట్ బటన్ని క్లిక్కండి. మీ Restore Point Create అయిపొఇనట్టే. ఇక ఎలాంటి ప్రొబ్లెంస్ వచ్చినా

ఆల్ హాపీస్ 🙂 … ఏమంటారు?

గమనిక: ఈ restore point  వారం పదిరోజులకంతా డెలీట్ ఐపోతుంది.

4 వ్యాఖ్యలు

తమ్ముడూ, బ్లాగు మిత్రులూ, మీకు చాలా థాంక్స్!!

మీ స్వాగతం పలుకులు చాలా ఆనందాన్ని ఇస్తున్నాయి.చిరంజీవి తనతో పాటూ డాన్స్ చేసే చాన్స్ ఇచ్చినంత  ఆనందంగా వుంది.అసలు నా ఆనందం వర్ణిచాలంటే నాకు పదాలు రావట్లేదు.అందరికీ చాలా థాంక్స్ అండి.
ఈ క్రెడిట్ అంతా మా తమ్ముడు నవీన్ ది.థాంక్స్ రా తమ్ముడు.

ఇప్పుడు అర్థం అవుతావుంది మా తమ్ముడు ఎప్పుడూ బ్లాగ్ బ్లాగ్ వికి వికి అని ఎందుకు అనేవాడూ అని. రసగుల్లా కంటే తీయగా ఉండే ఈ బ్లాగు, బ్లాగు మిత్రులను ఇలా కల్సుకున్నందుకు చాలా హ్యపీ గా ఉంది.

ఎప్పుడూ అందరినీ అన్నింటిలోనూ ప్రొత్సహిచ్చే వ్యక్తిత్వం వున్న నాకు, త్తమ్ముడు మరియు మీ అందరి కామెంట్స్ చాలా ఉత్సహాన్ని, ప్రోత్సాహాన్ని ఇస్తోంది.

జీవితంలో ఎప్పుడూ ఎలాంటి సందర్బంలొనైనా హ్యపీగా ఉండాలనే తత్వం వున్న నాకు చాలా హ్యపీగా ఉంది. 

8 వ్యాఖ్యలు

లావు పెరగడం ఎలా?

బరువు తగ్గాలంటే కష్టం కాని, బరువు పెరగాలంటే చాలా సులువు. http://gsnaveen.wordpress.com/2007/08/11/tips_for_obesity లో వ్రాసిన పది పాయింట్లకు వ్యతిరేకం చెస్తే సరి :), ఏమంటారు?.

లా చెప్పినంత సులువు కాదులెండి.నాకు ఇది బాగా తెలుసు ఎందుకంటే నేను ఉద్యోగంలో చేరిన తర్వాత నాకు ఇద్దరు స్నెహితులు తగిలారండి. ఇద్దరూ తెలుగువారే. ఇద్దరికీ ఒకటే ప్రొబ్లెం, వుండవలసిన బరువుకంటే తక్కువ బరువు వుండటం.ఎంత తిన్నా లావు కాక పోవడం.

ఇద్దరి నడవడికలు దాదాపుగా ఒకటే అంటే నమ్మండి. బాచ్లర్ గా వున్నప్పుదు వీరితో 2 సంవత్సరాలు వున్నాను కాబట్టి వారిని చూసి నాకు (లావు పెరగాలంటే) అర్థం అయ్యింది ఇది:

ఎప్పుడూ ఎక్కువగా టెన్షన్ ఫీల్ అవకూడదు.నా స్నెహితులకు చిన్నదానికైన చాలా టెన్షన్ ఫీల్ అయ్యేవారు.

కారం నొర్మల్ గా తినాలి. నా స్నెహితులకు భోజనానికి పచ్చి మిరపకాయలు లేనిదీ అన్నం దిగేదికాదు.

స్వీట్లు బాగా తినాలి.

పచ్చడి (ఉరగాయ) నొర్మల్ గా తినాలి. ప్రతిసారి భోజననికి 5 – 6 ఉరగాయ ముక్కలు తినడం లాంటివి చేయకూదదు.

చిన్నవాటికంతా ఎక్కువ ఆలొచించకూడదు.

నెను అర్థం చెసుకున్నంత వరకు బరువు తక్కువ ప్రొబ్లెం కొంచం మైండ్ రిలేటెడ్ అనిపిస్తుంది.

ఒక స్నేహితుడు మాత్రం పెళ్ళి ఐన సంవత్సరానికి కొంచం లావయ్యాడు 🙂

109 వ్యాఖ్యలు

Hello world!

Welcome to WordPress.com. This is your first post. Edit or delete it and start blogging!

4 వ్యాఖ్యలు

« Newer Posts