స్నానం – ముందు కాలం , ఈ కాలం

తెల్లవారి జామున అందరూ ముగించుకునే పనుల్లో స్నానం ఒకటి.

ముందు కాలంలో ఎలా ఉండేదంటే, ఇంటి ఇల్లాలు వంట పనులు మొదలెట్టెకి ముందే ఖచ్చితంగా స్నానం చేసేవారు.  దానిని మేము మడుగు అంటాము. ముందు కాలం వాళ్ళ మడుగు ఎల ఉండే వారూ అని చెప్పడానికి ఉదాహరణ మా స్నెహితుని నానమ్మ. మా పక్కపక్క ఇంటిలోనే ఉండే వారు. ఎంత పద్దతిగా పాటించే వారో ఒక పండుగ రోజు తెలిసేది.

ఆ పండుగరోజు నేను మా స్నేహితునితో వీధిలో మాట్లాడుతూ ఇంటి అరుగు పైన కూచొని ఉన్నము. చిన్నపిల్లలు ఆడుకొంతూ ఉన్నరు. మా స్నేహితుని వాళ్ళ నాన్నమ్మ గుడికో ఎక్కడి కో వెళ్ళుతూ ఉన్నారు. ఆడుకునే పిల్లాలు పరుగెడుతూ ఒకరు ఆవిడని పొరపాటున తాకారు. వెంటనే ఆ పిల్లల్ని అరిచి ఇంటికెల్లి చీర మార్చుకొని తర్వాత వెళ్ళారు.

దీనిని చూసి నాకేమనిపిస్తోండంటే ఆవిడ నిష్టతో భక్తిని పాటించారు అని. ఆ రోజుల్లో (దాదాపు 20 ఏళ్ళ క్రితం) ఆవిడకి శ్రీ ఆంజనేయ స్వామి కనిపించే వారట. అంత భక్తి శ్రద్ధలు ఉండేవి ఆకాలంలో.  పండగలన్నీ  భక్తి శ్రద్ధలతో, మడుగు తో చేసేవారు..

ఇంతటి భక్తి శ్రద్ధలతో, మడుగు తో  వంటలు వండే వారు అప్పటి ఆడవారు. అందుకే ఇంట్లో అందరికీ వంటలు బాగా వంటపట్టేవి.

ఈ కాలంలో(నేను ఆంధ్ర, మహరాష్ట్ర, యూ.కె లో చాలా కుటుంబాలను గమనించాను), అందరూ ఎలా తయారయ్యరంటే వాళ్ళకు తోచింది కరక్ట్. స్నానం అనేది పట్టించుకోరు. సౌకర్యం చూసుకొంటారు. స్నానం అనేది పట్టిచ్చుకోక పోతే ఎక్కడి మడుగు,ఎక్కడి నిష్ట, ఎక్కడి భక్తి శ్రద్ధలు?

9 వ్యాఖ్యలు »

  1. ఈ కాలం జనం ప్రశ్నించడం ఎక్కువ. వారి తర్కానికి అందని దంతా అపద్దం అనుకుంటారు. వారి ప్రశ్నలకు సమాధానం అందరి వద్ద ఉండవు.
    టూకీగా చెప్పాలంటే…అన్నం తినే ముందు తట్ట, చేతులు ఎందుకు కడుగుతాము? శుభ్రంగా తిందామనే కదా? ఈ మడుగు…ఉపవాసాలు…ఆచారాలు… భక్తి అనే ఆహారం తినే ముందు ఆత్మను కడగటం లాంటిది.

  2. radhika said

    నేనొప్పుకోనండి.. ఆ నూనెలు,పోపు ఘాటు,ఆ తరువాత ఇంటిల్లిపాదీ వెళ్ళాకా బాత్రూము క్లీనింగు….ఎన్ని పనులుంటాయి.పొద్దన్నే స్నానం చేసేస్తే బాత్రూములదీ కడిగాకా మళ్ళా చెయ్యాలి.అన్ని సార్లు ఎవరు చేస్తారండి?

  3. అశోక్ గార్ల said

    రాధిక గారూ, నా టపాలో చెప్పినట్టు మీరనుకునేదాన్ని సౌకర్యం చూసుకోవడం అని అంటారు.
    నా అభిప్రాయం ఏమంటే, “ఇంటికి దీపం ఇల్లాలు” అని అంటారు. ఇంటిలో రోజు మొదలవడం ఇల్లాలితోనే మొదలవుతుంది. ఆమొదలవడం స్నానంతో మొదలైతే బాగుంతుందని నా అభిప్రాయం.

  4. I agree with you Asok gaaru.. నాక్కూడా స్నానం చేసి పనులు మొదలుపెట్టాలనిపిస్తుంది.. మడి అని కాదు కానీ ఫ్రెష్ ఫీలింగ్ ఉంటుంది.. ముఖ్యంగా ఇంటికెవరన్నా వస్తే కాఫీ అయినా స్నానం అయ్యాకే పెట్టేది 🙂

  5. అశోక్ గార్ల said

    నిషిగంధ గారూ, నా అభిప్రాయం ఏమంటే – మీరనుకునే ఫ్రెష్ ఫీలింగే మడుగులో ఒక బాగం.

  6. kolord97@gmail.com said

    inkekadi brahminism. sanka naki poyindi antha. ayyagaru miyya gaaru pyna nillu posukuntaaru subram mathram takkuveele.

  7. teresa said

    ఆ మడీ, తడీ పాటించుతూ ఏ మాత్రం శుభ్రం లేక పోవడాన్నీ చూశాను నేను! మడి/మడుగు లాంటి ఆచారాలు పాటించకుండానే పరిశుభ్రంగా ఉండే ఇళ్ళు కోకొల్లలు.

  8. ఇంతకీ మడుగు అంటే మడేనా కాదా? రెండూ ఒకటే అయినచో, ఫ్రెష్ ఫీలింగ్ మడి కాదు! అదొక ఆచారం అంతే! ఇల్లంతా మడ్డిగా ఉన్నా మడి పేరుతో తడి బట్టలు కట్టుకుని ఎవర్నీ అంటుకోకుండా తిరగడంలో ఫ్రెష్ ఫీలింగ్ ఏముంది? (అమ్మమ్మ ని ఇదే ప్రశ్న అడిగితే శ్లోకాలు గొణుక్కుంటూ అవతలికి పొమ్మని చెయ్యి చూపించేది)

    teresa బాగా చెప్పారు!ఇలాంటి వాళ్ళని నేనూ ఎరుగుదును.

    పొద్దున్నే స్నానం చేసాకే ఎదైనా మొదలెట్టడం బాగుంటుంది, కానీ పార్లల్ గా ఇల్లు శుభ్రంగా లేకపోతే ఎన్ని స్నానాలు చేసినా లాభం లేదు.

  9. అశోక్ గార్ల said

    ప్రసాదానికి ఎందుకు అంత పవర్ ఉందని కళ్ళకు అద్దుకుని తింటారు? దేవుడికి నైవేద్యం పెట్టేకి ముందు మడుగు తో పరిశుభ్రంగా ప్రసాదాన్ని తయారు చేస్తారు మరియు మనసులో దైవ స్మరణతో చేస్తారు కాబట్టి. అదే విధంగా రోజూ వంటలు తయారు చేసే వారు మన పెద్దవాళ్ళు.కాలం మారినా, టెక్నాలజీలు వచ్చినా ఈ స్నానం చెసి, దైవ స్మరణ తో చేయడం వలన మనసు ఎంత హాయిగా ఉంటుందో చూడండి!! ఇవి బేసిక్స్ అని నా అభిప్రాయం. మన లైఫ్ స్టైల్ ఎంత మారినా, బేసిక్స్ అలానే పాటిస్తే లాభమే కద?
    ముందు వేప పుల్ల తో పళ్ళు తోముకునే వారు, ఇప్పుడు బ్రస్షు పేస్టు తో తోముకుంటున్నము. ఇక్కడ బసిక్ ఏమంటే పళ్ళను సుభ్రంగా ఉంచుకోవడం.అలానే మన శరీర మరియు మనసు శుభ్రతానూ!

    ఆల్ హ్యపీస్….

RSS feed for comments on this post · TrackBack URI

వ్యాఖ్యానించండి