Archive for Uncategorized

ఇంకా చాలా ఆర్ఠిక పరమైన కష్టాలు ఎదురుకొవలసిన అమెరికా!!!

అప్పులతో (credit cards etc.,) సుఖాలకు అలవాటు పడ్డ అమెరికా చాలా ఆర్ఠిక  పరమైన కష్టాలు ఎదురుకొవలసి ఉంది. ఎందుకు అనేది ఈ కింద ఇచ్చిన లింకు లో చాలా బాగ వివరించి ఉంది. దీని పై మీ అభిప్రాయం?

http://www.rediff.com/money/2008/nov/06bcrisis5.htm

2 వ్యాఖ్యలు

ఇల్లు.. ఆఫీసు… ఇలా ఆల్ హ్యాపీసు!! ఏం అంటారూ?

‘మన రూటే సెపరేటు..’ అన్నట్టు పని దారి పనిదే.. కుటుంబ జీవితం దారి వేరే.. ఉంటే అంతా హాయి. కానీ చాలామంది రెండు బళ్లనీ వేర్వేరు పట్టాల మీద నడపలేరు. ఆఫీస్‌లో ఉన్నప్పుడు ఇంటి సమస్యలూ, కుటుంబంతో గడుపుతున్నప్పుడు ఆఫీస్ పనులూ.. గురించి ఆలోచిస్తూ మనశ్శాంతి లేకుండా చేసుకుంటారు. అలాకాకుండా ఉండాలంటే.. ఇదిగో ఈ చిట్కాలు పాటించి చూడండి!

– పని చేసేచోట మీరు బాస్ కావొచ్చు. ఇంట్లో కాదు! అలాగే, మనం మరొకరి కింద పనిచేసే ఉద్యోగులం కావొచ్చు. అలాగని ఇంట్లో ఒదిగి ఉండక్కర్లేదు.. అలాగే, అక్కడ చూపించలేని ప్రతాపాన్ని ఇక్కడ చూపించకూడదు. కుటుంబసభ్యుల్ని మనతో కలిపి ఉంచేవి అనురాగబంధాలు కానీ, జీతభత్యాలు కావు. ఇది గుర్తుంచుకుని, ప్రేమాభిమానాల్ని ఇచ్చిపుచ్చుకుంటే ఇంటికీ ఆఫీస్‌కీ విభజన రేఖ స్పష్టంగా ఉంటుంది.

– ‘పని చేస్తుంటే పగలూరాత్రీ తెలియదు..’ అనుకోవడం బావుంటుందేమో.. కానీ అత్యవసరమైతే తప్ప ఆఫీస్ వర్క్‌ని ఇంటికి తీసుకురాకూడదు. అలాగే రాత్రిపూటా, వారాంతాల్లోనూ పని చేయడం అలవాటుగా మార్చుకోకూడదు. అలాగే ఇంట్లో కంప్యూటర్ ఉంది కదాని, నెట్ చూడటం, ఆఫీస్‌కు సంబంధించిన పనుల్ని తెముల్చుకోవడం వద్దేవద్దు!

–  ఇంటికి చేరగానే, మీ భాగస్వామి ఆ రోజునెలా గడిపారో అడిగి తెలుసుకోండి.. ఏదో నిర్లిప్తంగానో, లేదా ఆరాలు తీస్తున్నట్టో కాదు! వాళ్లు చెప్పేది వినటం వల్ల మీలో ఆఫీస్ ఆలోచనలకు అడ్డుకట్ట పడుతుంది. పైగా, తమను పట్టించుకుంటారన్న భావన భాగస్వామిలో కలగడం ఓ ప్లస్ పాయింట్. (మన గురించి మనం మాట్లాడాలన్న తపన అందరికీ ఉండేదే. అయితే ఈ కాసేపు, మీగురించి చెప్పాలన్న వాంఛను అణుచుకోండి.)

– బాగా ఒత్తిడిగా ఉన్నప్పుడు, పనెక్కువ చేసిన తర్వాత, ఇంటికెళ్లడానికి ఎక్కువ దూరం, సమయం పట్టే మార్గాన్నెంచుకోవాలి. మొత్తం ప్రయాణం గంట పడుతుందనుకుంటే దాన్ని రెండు భాగాలుగా విభజించండి. ఒక సగంలో మర్నాడు చేయాల్సిన పనుల గురించి ఆలోచించండి. రెండో సగంలో పాటలు వినడం, లేదా మరేదైనా హాయినిచ్చే విషయాల గురించి అనుకోవాలి. దీనివల్ల లాభమేంటంటే ఇల్లు చేరేసరికి ఆఫీస్ ఆలోచనలు పూర్తిగా పక్కకు పోతాయి.

–  చాలామందికి ‘నేను లేకుంటే ఆఫీస్ నడవదు..’ అన్న ధోరణి ఉంటుంది. నమ్మండి, నమ్మకపోండి.. అది పూర్తిగా తప్పు! ఏ కార్యాలయమైనా ఒక్కరి మీదే ఆధారపడి పనిచేయదు. అందువల్ల సమయం మొత్తం ఆఫీస్ పనికే ధారపోయడం.. అవసరం లేదు!

– దూరాల్ని చెరిపెయ్యడంలో సెల్‌ఫోన్‌ది కీలక పాత్ర. సెల్ మన అవసరానికి ఉపయోగపడేదే తప్ప, అదే ప్రాణావసరం కాకూడదు. వారంలో రెండు మూడు రోజులు సాయంత్రం 5 నుంచి మర్నాడు 5 వరకూ సెల్‌ఫోన్ వాడటం మానెయ్యాలి. సైలెంట్‌లో పెట్టడం లేదా స్విచాఫ్ చెయ్యడం.. దీనివల్ల పని గురించి ఆలోచించే సమయం తగ్గుతుంది!

(ఈనాడు లోని ఈతరం నుండి సేకరణ)

6 వ్యాఖ్యలు

తమ్ముడూ, బ్లాగు మిత్రులూ, మీకు చాలా థాంక్స్!!

మీ స్వాగతం పలుకులు చాలా ఆనందాన్ని ఇస్తున్నాయి.చిరంజీవి తనతో పాటూ డాన్స్ చేసే చాన్స్ ఇచ్చినంత  ఆనందంగా వుంది.అసలు నా ఆనందం వర్ణిచాలంటే నాకు పదాలు రావట్లేదు.అందరికీ చాలా థాంక్స్ అండి.
ఈ క్రెడిట్ అంతా మా తమ్ముడు నవీన్ ది.థాంక్స్ రా తమ్ముడు.

ఇప్పుడు అర్థం అవుతావుంది మా తమ్ముడు ఎప్పుడూ బ్లాగ్ బ్లాగ్ వికి వికి అని ఎందుకు అనేవాడూ అని. రసగుల్లా కంటే తీయగా ఉండే ఈ బ్లాగు, బ్లాగు మిత్రులను ఇలా కల్సుకున్నందుకు చాలా హ్యపీ గా ఉంది.

ఎప్పుడూ అందరినీ అన్నింటిలోనూ ప్రొత్సహిచ్చే వ్యక్తిత్వం వున్న నాకు, త్తమ్ముడు మరియు మీ అందరి కామెంట్స్ చాలా ఉత్సహాన్ని, ప్రోత్సాహాన్ని ఇస్తోంది.

జీవితంలో ఎప్పుడూ ఎలాంటి సందర్బంలొనైనా హ్యపీగా ఉండాలనే తత్వం వున్న నాకు చాలా హ్యపీగా ఉంది. 

8 వ్యాఖ్యలు

లావు పెరగడం ఎలా?

బరువు తగ్గాలంటే కష్టం కాని, బరువు పెరగాలంటే చాలా సులువు. http://gsnaveen.wordpress.com/2007/08/11/tips_for_obesity లో వ్రాసిన పది పాయింట్లకు వ్యతిరేకం చెస్తే సరి :), ఏమంటారు?.

లా చెప్పినంత సులువు కాదులెండి.నాకు ఇది బాగా తెలుసు ఎందుకంటే నేను ఉద్యోగంలో చేరిన తర్వాత నాకు ఇద్దరు స్నెహితులు తగిలారండి. ఇద్దరూ తెలుగువారే. ఇద్దరికీ ఒకటే ప్రొబ్లెం, వుండవలసిన బరువుకంటే తక్కువ బరువు వుండటం.ఎంత తిన్నా లావు కాక పోవడం.

ఇద్దరి నడవడికలు దాదాపుగా ఒకటే అంటే నమ్మండి. బాచ్లర్ గా వున్నప్పుదు వీరితో 2 సంవత్సరాలు వున్నాను కాబట్టి వారిని చూసి నాకు (లావు పెరగాలంటే) అర్థం అయ్యింది ఇది:

ఎప్పుడూ ఎక్కువగా టెన్షన్ ఫీల్ అవకూడదు.నా స్నెహితులకు చిన్నదానికైన చాలా టెన్షన్ ఫీల్ అయ్యేవారు.

కారం నొర్మల్ గా తినాలి. నా స్నెహితులకు భోజనానికి పచ్చి మిరపకాయలు లేనిదీ అన్నం దిగేదికాదు.

స్వీట్లు బాగా తినాలి.

పచ్చడి (ఉరగాయ) నొర్మల్ గా తినాలి. ప్రతిసారి భోజననికి 5 – 6 ఉరగాయ ముక్కలు తినడం లాంటివి చేయకూదదు.

చిన్నవాటికంతా ఎక్కువ ఆలొచించకూడదు.

నెను అర్థం చెసుకున్నంత వరకు బరువు తక్కువ ప్రొబ్లెం కొంచం మైండ్ రిలేటెడ్ అనిపిస్తుంది.

ఒక స్నేహితుడు మాత్రం పెళ్ళి ఐన సంవత్సరానికి కొంచం లావయ్యాడు 🙂

109 వ్యాఖ్యలు

Hello world!

Welcome to WordPress.com. This is your first post. Edit or delete it and start blogging!

4 వ్యాఖ్యలు