చిరంజీవి డాన్సులు చూసి, నేర్చుకున్నాము!!!

నేను మా తమ్ముడు, ఇద్దరూ చిరు ఫాన్సు. దాదాపు 1988 వరకు, డాన్స్ అంటే నాకు, మా తమ్ముడికి అంత టచ్ లేదు.

డాడి, అమ్మ, నేను, మా తమ్ముడు ప్రతి వారం ఆదివారం రొజు ఫస్ట్ షొ సినిమాకు ఇంటి నుంచి తియేటర్ కి బజాజ్ స్కూటర్ లో వెళ్ళే వాళ్ళం.

చిరు సినిమా రిలీస్ ఐతె ఇక చెప్పనవసరం లేదు, చిరు సినిమాకే పోవాలని అల్లరి చేసే అవకాసం మా అమ్మ నాన్న మాకు ఇచ్చే వాళ్ళు కాదు.ఎందుకంటే వాళ్ళ వోట్లు కూడా చిరు సినిమాకే.

యముడికి మొగుడు సినిమా లో, యమలోకంలో వుండే ‘నో నో నాట్యమిదా..’ పాటకు మన ‘చిరూ అంబికా తో చెసే డిస్కొ నాట్యం  ను చూసి మొదలయ్యింది డాన్స్ పైన ఇంట్రెస్ట్.

నాకు తెలిసి చిరు ఒక కొత్త ట్రెండ్ ని ఈ సినిమా నుంచే మొదలెట్టాడనుకుంటా. సినిమా హీరొయిన్ల తో కాకుండా సొలొ కాని వాంప్ తో కాని స్పెషల్ అపియరెన్స్ హెరొయిన్ తొ కాని స్పెషల్ స్టెప్పులతో ఒక పాట ఉండటం.

ఇది మొదలు దాదాపు గా ప్రతి సినిమాలోను అలాంటి పాటలుంటాయి.

మరణమౄదంగం లో ఉన్న ‘చక్కు బుక్కురు చక్కు బుక్కురు చక్…జిం జిం జిం ఏ జంగిలి జిమజిమ… పాట మధ్యలో 10 సెకన్లు  ఒట్టి మ్యూజిక్ ఉండి బాక్ గ్రౌండ్ నీళ్ళలో బాంబులు పెలుతుంటే మన చిరు మరియు రాధా మాంచి స్టెప్పులు వేస్తారు. 20 ఏండ్ల ముందు థియేటర్ లో చూసిన ఇలాంటి స్టెప్పులు, మ్యూజిక్ ఇంకా నా మదిలో మెదులుతూనే ఉన్నాయి.

ఇలాగే స్టేట్ రౌడి లో ‘వన్ టూ త్రీ ఫోర్ ఫోర్ ఫోర్ బ్రేక్ బ్రేక్ బ్రేక్ డాన్స్ డాన్స్…జత కుదిరే ఇద్దరికీ…..’ ఈ పాట మధ్యలో కూడా 10 సెకన్లు సైలెంటు ఐపోయి కాఫీ తాగినట్లు ఆక్టింగ్ చెసి ఒక్కసారిగా మ్యూజిక్ తో పాటూ డాన్స్ స్ స్టార్ట్ అవ్వుద్ది. చిరు తొ పాటూ రాధ ఇలాంటి డాన్సుల్లొ బలె జొడీ. ‘రాధ రాధ మదిలో నా మన్మధ బాధ…’ పాటలో కూద స్టెప్పులు అదుర్స్.

కొండవీటి దొంగ లో రెండు పాటలు ఒకటి ‘శుభలేఖ రాసుకున్న యదలో ఎపుడో…’ – ఈ పాటలో (ఇద్దరూ తెలుపు, ఆకు పచ్చ రంగులున్న డ్రస్సులు వేసుకొని ఉంటరు. బ్యాగి పాంటు, టి-షర్ట్ చిరు వేసుకొనుంటాడు.అప్పుడు బ్యాగి పాంటు ఫేమస్ కదా!! రాధ ఆకు పచ్చ, తెలుపు కాంబినాషన్లో ఉందే స్కిర్టు వేసుకొనుంటాది) కాండిల్స్ మధ్యలో చిరు, రాధ ఒట్టి మ్యూజిక్కుకు, పిడికిళ్ళు బిగించి వారి వారి చెతులు వాళ్ళ చెస్ట్ దగ్గర పెట్టుకుని ఒక్కాలు ముందుకి, ఒక్కాలు  వెనక్కి రెండు మూడు సార్లు వెసే స్టెప్పులు స్పెషల్ స్టెప్పులు.  ఇంకొకటి ‘చమకు చమకు చాం పట్టుకో పట్టుకో చాన్సు దొరికరొ హొయ్యా…’. ఈ పాట మధ్యలో మ్యూజిక్కంతా సైలెంట్ ఐపోయి మన చిరు కుడి జెబులోంచి రుమాలు తీసి చెమట తుడుచుకొని ఎడమ జెబులో పెడతాడు.సూపర్ స్టైలు గా ఉంటాది ఈ స్టెప్పు.

గ్యాంగ్ లీడర్ గురించి ఇంక చెప్ప్ప నవసరం లేదు.ప్రతి పాటా ఒక దాన్ని మించి ఒకటి. తెల్లటి డ్రస్సులో టైటిల్ సాంగుకు చిరు వేసే స్టెప్పులతొ ఉర్రూతలూగించాడు. ‘వాన వానా వెల్లువాయే…’ పాట ఎమని వర్ణించనూ. చిరు నల్ల డ్రస్సు, తెల్ల షూసు, 2 తెల్ల బెల్టులు, విజయ శాంతి నల్ల చీర, మెడలో వెరైటిగా ఉన్న ముల్లులుముల్లులు ఉండే  చెయిను, ఫ్రీగా వదిలేసిన తన హెయిరు, బాక్ గ్రౌండ్లో వచ్చే ఆ ఫ్రెష్ పొగలో ‘ఎదొ ఎదొ ఎదొ హాయి….’ అనే చరణం అవ్వగానే వచ్చే మ్యుజిక్ కి సూపర్ స్టెప్పులుంటాయి.

జగదేకవీరుడు అతిలోకసుందరి లో “చిరు” తెల్లటి బాగి పాంటు, శ్రీదేవి తెల్లటి చొలీ గాగ్రా వెస్కొని  ‘అబ్బ నీ తీయనీ దెబ్బ..ఎంత కమ్మగా ఉందిరోయబ్బ..’ పాటకు సింపుల్ స్టెప్పులెస్తుంటే అబ్బబబ్బబబ్బ ఎంత బాగుందో!! ఇంకా గుర్థుంది, సినిమా లో ఈపాట వచ్చెటప్పుదు చిరు, శ్రీదేవి లను ఫొటొలు తీసుకున్నారు.అంత అందంగా ఉన్నారు ఈ పాటలో ఈ పేయిర్. డిజిటల్ కేమరలు వచ్చేకి ముందు ఇలా సినిమలో ఫొటొలు తీయడం ఇదొక్కసారే చూసాను.

రాజ విక్రమార్క లో ‘గగన కిరణ గమనమిదీ..’ పాటలో తలను వేరైటీగా వెనక్కు కదిలిస్తూ ఒక స్టెప్పుంది.సూపర్ స్టెప్పండి బాబూ…

రౌడీఅల్లుడు పాటలు బాసూ, ఎక్సలెంట్ పాటలూ, పాటలకి అంతకన్న ఎక్సలెంట్ స్టెప్పులు.’బొలొ బొలొ బొలొ రాణీ క్య చాహియే.. ప్యార్ చాహియే యా పైసా చాహియేఅ..’ పాటకి మాస్ స్టెప్పులే మాస్ స్టెప్పులు.స్పెషల్లీ చిరు ఖాకీ షర్ట్ చివర పట్టు కొని అడ్డంగా నిలువుగా మ్యూజిక్కుకు సరిగ్గా సరిపోయే విధంగా స్టెప్పులు ఇరగ తీస్తాడు.
‘లవ్ మీ మై హీరొ.. మజాగా ముద్దిస్తా రారో’ పాటలో మ్యూజిక్ అదురుద్ది.ఈ పటలో అమితంగా నచ్చేదెదంటే మ్యూజిక్ పండడానికి మ్యూజిక్ డైరెక్టర్ చాలా మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ ని క్రమబద్దంగా వాడాడు.
పాట మధ్యలో అంతా సిలెంట్ ఐపోయి ఫ్లూటు తో మొదలు అయ్యి, ఫ్లూటు రెండు సార్లు ఊదగానే, ఫ్లూటు తో పాతూ, సింగల్ స్టిక్ డ్రం బీట్ అందుకుంటుంది,వీటితో పాటూ మెల్లమెల్లగా డ్రంస్ అందుకుంటాయి. ఫ్లూటు తో మ్యూజిక్ మొదలైనప్పుడు మన చిరు కాళ్ళ పై కూచోని ఒక్కొక్క మ్యూజిక్ ఇన్స్ట్రుమెంత్ పెరిగే కొద్దీ మెల్లగా పక్కకు కదులుతూ పైకి లేస్తాడు. అదుర్సే అదుర్స్.
‘చిలుకా క్షేమమా..’ పాటకు క్లాస్ స్టెప్పులేస్తాడు.

ఘరానామొగుడు ‘బంగారు కోడి పెట్ట వచ్చెనండి..ఎ పాప ఎ పాప ఎ పాఆప..’పాటలో మ్యూజిక్కుకి కాళ్ళ పై కూచోని ముందుకు వెనక్కు కదులుతూ పైకి లేస్తాడు.అప్పటి వరకూ అలాంటి స్టెప్పు వీసింది చిరు ఒక్కడే!!
మిగతా అన్ని పాటలూ కూడా చక్కని మ్యూజిక్ తో అందరినే మాస్ ని క్లాస్ ని కలిపి ఎంటర్టైన్ చేస్తది. 

ముఠామేస్త్రి ‘ఈ పేటకు నేనే మేస్తిరీ..’ పాటలో పంచెని ఎడమ చేతి సంక కింద పెట్టుకొని, 75 డిగ్రీలు ఒంగి చేత్తో గాంధీ కర్రను పట్టుకున్నట్లు గాల్లో పట్టుకొని, వీపుని పైకీ కిందకి కదిలిస్తూ ముందుకు నడుస్తాడు. బలే ఉంటుంది ఈ స్టెప్పు.

ఇక్కడి వరకు వచ్చేసరికి నేను మా తమ్ముడికి మ్యూజిక్, డాన్స్ పైన ఎంత ఇంటరెస్ట్ వచ్చిందంటే ముఠమేస్త్రి చూసి ఇంటికి వచ్చిన తర్వాత నేను మా తమ్ముడు (నవీన్ గార్ల) ఆ స్టెప్పు గురించి డిస్కస్ చేసి, నేను చేస్తే తమ్ముడు చూసి, వాడు చేస్తే నేను చూసి ఒకర్నొకరు కరెక్ట్ చేసుకొని నేర్చుకొన్నాము.

నేను ఇంటర్ ఫస్ట్ ఇయర్ కాలేజ్ ఆనివర్సరి ఫన్షన్ కి గ్రూప్ తో ముఠామెస్త్రి టైటిల్ సాంగ్ కి డాన్స్ చెసే అవకాసం వచ్చింది.ఐదే రోజులున్నయి ప్రిపరేషన్ కి. డాన్స్ మాస్టర్ ని మాట్లాడు కొన్నాము. రోజుకు 2 గంటలు చెప్పే వాడు. మిగతా అంతా మేమే ప్రాక్టీస్ చెసుకున్నము. నేను చిరు, మిగతా వాళ్ళు గ్రూప్ డాన్సర్స్.డాన్స్ మాస్టారు నాకు కట్టి పట్టుకొని నడిచే స్టెప్పు బాగ వస్తాఉంది అన్నడు. చాల ఆనందం అయ్యింది. సినిమా చూసి వచ్చి నవీన్ తో దిస్కస్ చెసినందుకు ఆ స్టెప్పు కాన్ ఫిడెంట్ గా వచ్చింది. నేను డాన్స్ లో పాల్గొంటే, మా తమ్ముడు ఒక కామెడి డ్రామ లో ప్రధాన పాత్ర వేసాడు. నేను తమ్ముడు స్టేజి షొలు ఇస్తున్నము కాబట్టి అమ్మ నాన్నలు వచ్చరు. స్టేజి పైన మొదటి సారి ఐనందు వల్ల ఫస్టు ఒక నిముషము స్టెప్పులు వెయడానికి టెన్షన్ పడి అలా నిల్చొని ఉండిపోయాను. ఆడియన్స్ అందరూ ఒకటే అరుపులు. 75 డిగ్రీలు ఒంగి వేసే స్టెప్పు వేయడానికి మ్యూజిక్ రాగానే కరెక్ట్ గా వేసా.వేయగానే, విజిల్సే విజిల్సు. అక్కడి నుంచి ఊపందుకున్నా. హిట్టయ్యింది.

చిరు వేసే స్టెప్పులు చూసి చూసి పైన చెప్పిని స్టెప్పులన్నింటిని నేర్చుకున్నా. 

ఇలా నేర్చు కున్న డాన్స్ నాకు మా తమ్ముడికి రాగింగ్ లో బలే ఉపయొగ పడ్డాయి. మా సీనీర్స్ ని బలె ఇంప్రెస్స్ చేసాము.

బీ.టెక్ నేను, తమ్ముడు వేర్వేరు కాలేజీలలో చదివినా కూడ, కాలేజ్ డే ఫన్షన్ కి, హాస్టల్ డే ఫన్షన్ కి, ఫ్రెండ్స్ బర్తడేలకి బలే డాన్సులేసి బెష్ బెష్ అని పించుకున్నము.

తర్వాత యం.టెక్ సూరథ్కల్ ఆర్.ఈ.సి కాలేజి లో చదివేటప్పుడు 2000 సంవత్సరం ఆంద్రా ఫొర్మాషన్ డే కి ఒక హిందీ పాటకి నా సొంత కొరియొగ్రఫి తో స్టేజి పైన డాన్స్ చేసాను.డాన్స్ ఐపోయాక 4 క్లాస్ చదివే మా హెచ్.ఓ.డి గారి అమ్మయి నా దగ్గరకు వచ్చి మీరు చాల బాగ డాన్స్ చెసారు అనంగానే బలే ఆనందమయ్యింది.

జాబు లో చేరాక, 2003 లో లండన్ వచ్చాను.ఇక్కడ మా కంపని ఆనివర్సరి ఫన్షన్ లో నేను డాన్స్ చేస్తానని నన్నడగ కుండా మా ఫ్రెండ్ మురళి నా పేరు ఇచ్చేసాడు. మురళి ఎంకరేజ్మెంట్ వల్ల నేను చాలెంజ్ గా తీసుకొని శంకర్ దాదా యం. బి.బి.యస్ రిలీజ్ అవ్వక ముందే ‘ఏ జిల్లా ఏ జిల్లా..’  పాటకు వారం లో నే నే కొరెయొగ్రఫి చేసి డాన్స్ చేసా. అద్దిరి పోయింది. ఫస్ట్ టైం నా డాన్సుని ఫ్రెండ్ కేమర తో వీడియొ తీయించు కున్నా. డాన్స్ ఐపోయి మా టీం లీడర్ దగ్గరకు పోయి కొచుంటే ‘ఇక్కడ ఏం చేస్తున్నవ్, సినిమాలో చేరకుండా’ అని అన్నడు. బలే ఆనందం అయ్యింది. డాన్స్ మధ్య లో చాల అలిసిపోయా. ఆడియన్స్ ‘చీరూ చీరూ’ అని ఎంకరేజ్ చేస్తుంటే ఈ నొప్పులూ తెలవకుండా హాయిగా వెసేసాను డాన్సు.   

ఇలా డాన్సులు చేసే దాని వల్ల, నన్ను నా ఫ్రెండ్స్ అంతా ‘చిరూ ‘చిరూ అని అంటారు.

‘చిరూ ‘చిరూ  అని పిలిస్తే ఎవరికి మాత్రం ఆల్ హ్యపీస్ 🙂 కాదు చెప్పండి?

14 వ్యాఖ్యలు »

  1. ఇదేమిటండి..నాకు తెలిసిన అతి కొన్ని విషయాలలో ‘చిరంజీవి ‘ ఒకటి. నేను రాద్దామనుకుంటే… మీరు రాసేసారు. చిరు డాన్స్‌లు గురించి ఒక టపా కాదు ఒక బ్లాగే రాయొచ్చు. దాన్సుల్లో చిరు బాడీ లాంగ్వేజ్ మరొకరికి రాదు. ఇప్పటి హీరోలు/డాన్స్ మాస్టర్స్ వొళ్ళంతా స్పీడ్‌గా తిప్పేస్తే అదే డాన్స్ అనుకుంటున్నారు. ఈ పాటల వీడియోలు అన్నీ నా దగ్గర ఉన్నాయి. అవై చూస్తుంటే… ఎంత ప్రశాంతంగా ఉంటుందో కదా… కేబుల్ టీవీ ఆంధ్ర లో ప్రారంభమైన రోజుల్లో ( 15 సంవత్సరాల క్రితం) ఈ సినిమా లు బాగా వేసేవారు. అప్పుడు నేను చూసినవి ఇంకా నా కళ్ళ ముందు అలానే ఉన్నాయి.

    ఇంకా ఫాంటు కుడి జేబు దగ్గర రెండు వేళ్ళతో పట్టుకుని, కుడీ కాలుని, నడుముని కొంచెం వూపుతాడు చూడండి. అబ్బబ్బ … ఏమి స్టెప్పులండి. బాబు. అవి చూసి, ఇంటి పక్క న అమ్మాయిల దగ్గర వేసి బోలుడు బిల్డప్ ఇచ్చేవాడిని.

    బయటకు వెళ్తున్నాను. మళ్ళీ డిటైల్డ్‌గా ఇంకో కామెంట్ రాస్తాను.

  2. చిరంజీవి నామం తలవంగానే ఒడలంతా పులకరించి ఆలోచనానుభవాల ధారను టపాలోకి ఒంపినట్టున్నావే. నేను బ్లాగటం మొదలు పెట్టినప్పటినుంచి కూడా ఇంత పెద్ద టపా వ్రాయలేదు అనుకొంటా..
    నాకు గుర్తుండి మొదటి సారి చిరును అనుకరిస్తూ ఇద్దరం డాన్సు చెయ్యటం యముడికి మొగుడుతో కాదు…అత్తకు యముడు అమ్మాయికి మొగుడు సినిమాకు అనుకుంటా. దానిలో “మొరుపులా ఆడతా..” పాటకు బాగా స్పూర్తి చెందాం. దానికి తోడు హాస్టల్లో పంచరత్నా టాకీసు నవీన్ ఆ పాటకు రెండు విధాల డాన్సు వేసి జనాల చేత శభాష్ అనిపించుకున్నాడు. దానితో ఇంటికొచ్చి మనం కూడా అలా చెయ్యడాని ప్రయత్నించాం 🙂

    ఇదంతా ఇరవై సంవత్సరాల ముందటి సంగతి..ఇలా బ్లాగు ద్వారా గుర్తు చేసుకుంటాం అనుకోలేదు. డాన్సులో మనం ఎన్ని బహుమతులు పొందినా అది ఖచ్చితంగా చిరంజీవిని చూసి పొందిన స్పూర్తే కారణం.

  3. radhika said

    లండన్ లో తీయించుకున్న వీడియోని మమ్మల్నీ చూడనియ్యండి.యూట్యూబ్ లో ఎక్కించి లింక్ పోస్టు చెయ్యండి.

  4. chsrinu said

    అయ్య బాబోయ్..మొత్తానికి మీరు ఇలాగ “చిరు”ని ఇన్స్పిరేషన్ తీసుకోని చాల చక్కగా డాన్స్ నేర్చేసుకున్నారు..వెరీ గుడ్.

    మీ టపాలో నాకు బాగా నచ్చింది ఏంటంటే ప్రతి పాటకు చిరు ఎలా స్టెప్పులు వేసాడో చక్కగా వివరించడం. మీ టపా చదువుతుంటే నా కళ్ల ముందు ఆ స్టెప్పులన్నీ అలా మెదిలాయి. చాల చక్కని పాటల్నీ , అంతకన్నా చక్కని డాన్సుల్నీ గుర్తు చేసినందుకు మీకు నెనర్లు.

  5. అశోక్ గార్ల said

    రాజు సైకం గారూ,
    టేక్ ఇట్ ఈజి. మీ డిటైల్డ్ కామెంట్ కొసం ఎదురు చూస్తున్నాను. డాన్స్ లో బాడి లాంగ్వేజ్ అనేకన్నా డాన్స్ లో గ్రేస్ అనడం బాగుంటుందని నా అభిప్రాయం. అంటే డాన్స్ చేసే దాన్లో చిరు కు వచ్చినంత గ్రేస్ ఎవ్వరికే రాదు. ఏమంటారు?

    నవీను,
    నువ్వు చెప్పింది కరెక్ట్. యముడికి మొగుడు నుంచే మొదలెట్టాము మనం డాన్సు చేయడం.

    రాధికా గారూ,
    నేను తీసుకున్న వీడియోని యూట్యూబు లో ఎక్కించి లింకు తప్పకుండా పోస్టు చేస్తాను. సీడి ఇందియా లో వుంది, కాబట్టి ఈనెల చివర పోస్టు చేస్తాను.

    శ్రీను గారు,
    మే పొగడ్తలకు నా నెనర్లు. చిరు డాన్స్ చూసి నేర్చు కొవడమే కాదు, చిరు డాన్స్ చూసినప్పుదల్లా నిఘంటువు లో ‘డాన్శ్’ అనే పదం తీసేసి ‘చిరు’ అని పెడతామనిపిస్తాది 🙂

    ఆల్ హ్యపీస్ 🙂

  6. అశోక్ గార్ల said

    చెప్పడం మరిచాను..

    నేను శంకర్ దాదా యం.బీ.బీ.యస్ సినిమాలోని ‘ఏ జిల్లా ఏ జిల్లా..’ పాటకు డాన్స్ చేసి (2 అక్టొబర్ 2004) ఈ రొజుటికి 3 సంవత్సరములు అయ్యింది.

    ఈ టపా ఈ తేదీకి కోఇన్సైడ్ (coincide ను తెలుగులో ఏమంటారో?) ఐనందుకు మరియు మీ అందరితో ఆనంద క్షణాలు పంచుకొంటునందుకు

    ఆల్ హ్యపీసండి… 🙂

  7. […] 17, 2007 at 8:47 am · Filed under Uncategorized https://gsashok.wordpress.com/2007/09/30/chiru_dance_ashoknaveen_learnt/  లో చెప్పిన ప్రకారం యూట్యూబ్ లో నా […]

  8. i am a chiru fan

  9. kumar said

    hi i am kumar from tdp i love chiru dances very because i am chiru fan i am big fan of chiru i also for pavan i see his movies

  10. ఎవరన్నా చిరంజీవి మీద పిహెచ్ డీ చేస్తే ఈ టపాని వాడుకోవచ్చు. డాన్సులు—అనే సబ్ టైటిల్ కింద! అసలు ఇరవయ్యేళ్ళ నాటి డాన్సుల్లోని ప్రతి మూమెంట్ నీ ఇంత బాగా గుర్తు పెట్టుకున్నారంటేనే తెలుస్తోందో చిరంజీవి డాన్స్ తో మీరు ఎంతగా ప్రేమలో పడ్డారో!

    రాధిక డిమాండే నాదీనూ! అర్జెంట్!

  11. reddy prakash said

    keko keka….
    chinna chiru … nee comment super….
    please send the vedio link after put it in youtube

  12. నా ఫాన్స్ కు 🙂 నచ్చిన నా డాన్స్!

    ఆల్ హ్యపీస్…

  13. manugunta said

    chalabhaghundhi

RSS feed for comments on this post · TrackBack URI

వ్యాఖ్యానించండి