Posts Tagged cough

ఆయుర్వేదమా మజాకా!!

మనం ప్రాక్టికల్ గా చూస్తే తెలుస్తుంది ఆయుర్వేదం ముందు ఏ రకం మందులైనా దిగదుడుపే అని.

13 ఏండ్ల ముందు నాకు టాన్సిల్స్ ఆపరేషన్ చేసారండి. ఆ చేసేది 30% టాన్సిల్స్ ని అలానే ఉంచేసాడు డాక్టరు. దీని వల్ల సంవత్సరానికి లేదా 2 సంవత్సరాలకు ఒక సారి థ్రోట్ ఇన్ ఫెక్షన్ (throat infection) వస్తుంది. వచ్చినప్పుడల్లా డాక్టర్ వ్రాసిచ్చిన ఆంటిబయొటిక్స్ (anti-biotics) మరియు జలుబు, దగ్గుకు మాత్రలు వేసుకునే వాడిని అవి తగ్గి పొయేవి .

నిన్నటి వారం ఎక్కువ ప్రయాణం చేసి నిద్ర తక్కువైంది. కూల్ డ్రింక్స్ తాగిన దాని వల్ల మరియు నీళ్ళ మారడం వల్ల థ్రోట్ ఇన్ ఫెక్షన్ (throat infection)  వచ్చింది. విపరీతమైన దగ్గండి బాబు. తల పోటు, చాతీ నొప్పి వచ్చేది దగ్గేటప్పుడు. దానికి తోడు దగ్గుకు స్నేహితుడైన జలుబు కూడా ఉన్నింది. దగ్గుకు, జలుబుకు ఒకటే పోటి అనుకోండి. మధ్యలో నాకు బాధ.

ఇదే ఇంత ఎక్కువగా ఇన్ ఫెక్షన్ (throat infection) నాకు రావటం. అందుకని ఈ జబ్బులకు శత్రువైన
మాంచి చెవి.ముక్కు. గొంతు డాక్టర్ దగ్గరకు వెళ్ళాను.ఆయన ఈ.యన్.టి కన్సల్టంట్ అట.

నా జబ్బు గురించి వివరంగా 2 నిముషాలలో చెప్పాను. పేపర్ పైన బరబర రాసుకుంటూ పోయాడు. ఒక నిముషం గొంతులేకేసి చూసాడు. టాన్శిల్స్ ఇన్ ఫెక్ట్ అయ్నాయి. ఆపరేషన్ మళ్ళీ చెయాలి. ఇప్పటికి  ఈ మందులు వాడు అని ఒక పెద్ద లిస్ట్ రాసిచ్చాడు 8 రోజులకు సరిపొయేటిగా. కన్సల్టేషన్ ఫీసు ఇక్కడే కట్టాలి అన్నాడు.

ఎంత కట్టాలో చెప్పగానే షాకయ్యానండి బాబు. పట్టుమని 10 నిముషాలు కూడ మాట్లాడ లేదు, అక్షరాలా 500 రూపాయలు గుంజాడు. పూణే లో పెద్ద కన్సల్టంట్ కదా అంత ఉంటాదిలేనని సర్దుకున్నా.

మందుల షాపుకెళ్ళి అదిగితే, డాక్టర్  రాసిచ్చిన మందుల ఖరీదు 700 రూపాయలవుద్ది అన్నాడు. మైండు బ్లాకు. మందులు తీసుకొలేదు.

ఒక్కొక్క ఆంటి-బయొటిక్ (anti-biotic) మాత్ర 45 రూపాయలు. అంత పవర్ ఫుల్ మాతర్లు అవసరమా అనిపిచ్చింది.

డాక్టర్ దగ్గరకు వెళ్ళేకి ముందే నీటి ఆవిరితో జలుబు తగ్గించు కున్నా లెండి :-).

డాక్టర్ రాసిచ్చిన 4 రకాల మాత్తర్లు, ఒక టానిక్కు తీసుకోలేదు. నా ఆలొచన ఎమిటంటే ఎంత పెద్ద దగ్గుకైనా మరీ ఇన్ని మందులు వాడితే నా రెసిస్టెన్స్ పవర్ (body immunity) దెబ్బ తింటుందని.

ఆఫీసుకి వెళ్ళా. నా దగ్గుని చూసి మా సహ ఉద్యోగిని (colleague) ఆయుర్వెదాచర్యుని (ayurvedic డాక్టర్) కలవమని చెప్పింది. ఆమె ఎప్పుడూ అయుర్వెదపు మందులే వాడుతారు.

ఆయుర్వెదాచార్యుని దగ్గరుకు వెళ్ళా. నా బాధ వివరించా.
ఏ పరికరాలూ వాడకుండా మామూలుగా నా కుడి చేతి పల్స్ చూస్తూ (సినిమాల్లొ చూపినట్టు :-)) ఒక నిముషం బాగా గమనిచ్చాడు. నొరు తెర్వమని గొంతులొ ఒక 2 సెకనులు చూసాడు. అంతే. 8 రొజులకు మందులిచ్చాడు. మిరియాల్ల కనపడే 3 మాత్తర్లు రాత్రి పడుకునే ముందు మరియూ పొడి మిశ్రమం (1/2 స్పూన్ powder) తెల్లవారి, మధ్యాహ్నం ఒక టీ స్పూన్ అంత తేనె లో వెసుకోమన్నడు. కన్సల్టెషన్ ఫీజు, మందులు కలిపి 175 రూపాయలు.

ఆ రాత్రి  మూడు మాత్త్రలు, మర్సటి రోజు 2 పూటలా తేనె తొ పొడి వెసుకున్నా. అంతే బల్బ్ స్విచ్ ఆఫ్ చేసినట్టు దగ్గు దాదపు 80% తగ్గిపోయింది. మూడ్రొజుల్లొ మొత్తం దగ్గు తగ్గిపూయింది. ఆల్ హ్యపీస్ 🙂

నేను చేసిందల్లా జలుబు తగ్గడానికి మామూలు నీటి ఆవిరిని నూటితో, ముక్కుతో పీల్చడం మరియు దగ్గు తగ్గడానికి అయుర్వెదాచార్యుడిచ్చిన మందు వాడటం . ఈ మందు కొంచం చెదుగా, కొంచం గాటుగా ఉంది. మనం రోజు వంటల్లో వాడే మిరియాలు లాంటివి మందు పొడి మిశ్రమంలో ఉన్నాయి.

మన అమ్మ, అమ్మమ్మ వాళ్ళు ఇచ్చే చిట్కాలను పాటిస్తే వంద శాతం పని చేస్తాయి. మనమే పాటిచ్చం. అది ఎందుకో  మీరే ఆలోచించి చెప్పండి?

ఆయుర్వేదం మన భారత దేశం లోనే పుట్టిందని చెప్పడానికి చాలా గర్వంగానూ ఆల్ హ్యపీస్  గానూ  ఉంది.

3 వ్యాఖ్యలు