Posts Tagged cat

వెళ్ళే దోవలో పిల్లి ఎదురైతే?

కొన్ని రోజుల క్రితం ఒక సందర్భం లో మా నాన్న తో మాట్లాడేటప్పుడు చెప్పారు,నేను పుట్టేకి ముందు నించే మా ఇంట్లో ఏదో ఒక పిల్లి ఉండేది,ఆ పిల్లికి పిల్లలు పుట్టేవి.రోజూ, మా నాన్న ఆ పిల్లులకి అన్నం పాలు పెట్టేవారట.

నాకు 12 – 13 సంవత్సరాలు వచ్చే వరకు కూడా మా ఇంటి పెరట్లో పిల్లులుండేవి. నేను మా తమ్ముడు ఆ పిల్లులకి పాలు అన్నం పెట్టే వాళ్ళం. అది తినేసాక, దాని దవడ కింద, తల పైన చేత్తొ తీడే వాళ్ళం. బలేగా ఉండేది. కుచోనున్న పిల్లిని, తలమేద నుంచి తోక వరకు తీడుతూ ఉంటే, వెనుక బాగం పైకి పిల్లి ముందు బాగం కన్న పైకి పెట్టి ఒక్కొక్క తీడుకూ మెల్ల మెల్లగా పైకి లేచేది.కొంత సేపు అల చేయటం నిలిపేస్తే మళ్ళీ కూచునేది.

సూర్య కిరణాలు అద్దం తో గోడ మీద, నేల మీద వేసి అటూ ఇటూ తిప్పడం, చీపురు పుల్ల తో ఆడించడం చేసే వాళ్ళం.

ఇలా చాలా మంది చేసి ఉంటారు.

కొంత మందికి పిల్లి అంటే అలర్జి, భయం ఉంటాయి.

ఇదంతా అర్తమయ్యింది.

అర్థం కానిది మనం వెళ్ళే దారిలో ఎదురు పడితే, ఎందుకు కొంచేపు కూచోని లేయాలి?  కొంత మంది ఇంటిలోకి వెళ్ళి కూచోని,నీళ్ళు తాగి వెళ్ళుతారు. ఇవన్నీ ఎక్కువగా మన తాతల కాలం లో జరిగేవి. ఇప్పుడు కూదా మన పెద్దవాళ్ళ తో వెళ్ళేటప్పుడు మనకు పిల్లి ఎదురైతే, ఇక పని ఐనట్టే? అని ఏదో ఒక కామెంట్ చెస్తారు.

ఇప్పుడు జాబ్ పని పైన లండన్ కి 2 నెలల కొసం వచ్చను.మా స్నెహితునిట్లో ఉంటున్నాను.ఆఫీసుకి వెళ్ళాలంటే ఇంటినుంచి 20 నిముషాల నడక, 10 నిముషాలు ట్రైన్లో వెళ్ళలి.

2 -3 వారాల క్రితం, ఎక్కువ పని ఉండి తొందరగా లేసి రేడి అయ్యి తెల్లవారి 0715 గం  అంతా బయల్దేరాను.తలుపు తీయంగానే, పక్క ఇంటి ముదు నల్ల పిల్లి కనిపించింది.మనసులో ఒక మిల్లి సెకను పైన రాసినవి గుర్థొచ్చి, నెక్స్ట్ మిల్లి సెకనుకంతా మర్చిపోయి బయల్దేరాను.రైల్వే స్టేషన్ వెళ్ళే దారిలో 3 -4 పిల్లులు కనపడ్డాయి (పెంపుడు పిల్లుల్లా ఉన్నయి). ఏమి పట్టించు కోకుండా వెళ్ళి అనుకున్న రైలు ఎక్క.

ఒక వేళ కనపడిన ప్రతి సారి ఒక చొట కొంచు సేపు కూచొని లెసి వెళ్ళింటే, ఏమయ్యేదీ? రైలు మిస్సయ్యేది.పని పంచేటయ్యేది.

నేనేమను కుంటానంటే అంతా మన మనసులో ఉధ్భవించే ఆలోచనలను (థాట్స్) పట్టి పన్లు జరుగుతాయి.

ఈ విషయంలో మీ అభిప్రాయం?

10 వ్యాఖ్యలు