Posts Tagged స్నానం

స్నానం – ముందు కాలం , ఈ కాలం

తెల్లవారి జామున అందరూ ముగించుకునే పనుల్లో స్నానం ఒకటి.

ముందు కాలంలో ఎలా ఉండేదంటే, ఇంటి ఇల్లాలు వంట పనులు మొదలెట్టెకి ముందే ఖచ్చితంగా స్నానం చేసేవారు.  దానిని మేము మడుగు అంటాము. ముందు కాలం వాళ్ళ మడుగు ఎల ఉండే వారూ అని చెప్పడానికి ఉదాహరణ మా స్నెహితుని నానమ్మ. మా పక్కపక్క ఇంటిలోనే ఉండే వారు. ఎంత పద్దతిగా పాటించే వారో ఒక పండుగ రోజు తెలిసేది.

ఆ పండుగరోజు నేను మా స్నేహితునితో వీధిలో మాట్లాడుతూ ఇంటి అరుగు పైన కూచొని ఉన్నము. చిన్నపిల్లలు ఆడుకొంతూ ఉన్నరు. మా స్నేహితుని వాళ్ళ నాన్నమ్మ గుడికో ఎక్కడి కో వెళ్ళుతూ ఉన్నారు. ఆడుకునే పిల్లాలు పరుగెడుతూ ఒకరు ఆవిడని పొరపాటున తాకారు. వెంటనే ఆ పిల్లల్ని అరిచి ఇంటికెల్లి చీర మార్చుకొని తర్వాత వెళ్ళారు.

దీనిని చూసి నాకేమనిపిస్తోండంటే ఆవిడ నిష్టతో భక్తిని పాటించారు అని. ఆ రోజుల్లో (దాదాపు 20 ఏళ్ళ క్రితం) ఆవిడకి శ్రీ ఆంజనేయ స్వామి కనిపించే వారట. అంత భక్తి శ్రద్ధలు ఉండేవి ఆకాలంలో.  పండగలన్నీ  భక్తి శ్రద్ధలతో, మడుగు తో చేసేవారు..

ఇంతటి భక్తి శ్రద్ధలతో, మడుగు తో  వంటలు వండే వారు అప్పటి ఆడవారు. అందుకే ఇంట్లో అందరికీ వంటలు బాగా వంటపట్టేవి.

ఈ కాలంలో(నేను ఆంధ్ర, మహరాష్ట్ర, యూ.కె లో చాలా కుటుంబాలను గమనించాను), అందరూ ఎలా తయారయ్యరంటే వాళ్ళకు తోచింది కరక్ట్. స్నానం అనేది పట్టించుకోరు. సౌకర్యం చూసుకొంటారు. స్నానం అనేది పట్టిచ్చుకోక పోతే ఎక్కడి మడుగు,ఎక్కడి నిష్ట, ఎక్కడి భక్తి శ్రద్ధలు?

9 వ్యాఖ్యలు