‘మన రూటే సెపరేటు..’ అన్నట్టు పని దారి పనిదే.. కుటుంబ జీవితం దారి వేరే.. ఉంటే అంతా హాయి. కానీ చాలామంది రెండు బళ్లనీ వేర్వేరు పట్టాల మీద నడపలేరు. ఆఫీస్‌లో ఉన్నప్పుడు ఇంటి సమస్యలూ, కుటుంబంతో గడుపుతున్నప్పుడు ఆఫీస్ పనులూ.. గురించి ఆలోచిస్తూ మనశ్శాంతి లేకుండా చేసుకుంటారు. అలాకాకుండా ఉండాలంటే.. ఇదిగో ఈ చిట్కాలు పాటించి చూడండి!
- పని చేసేచోట మీరు బాస్ కావొచ్చు. ఇంట్లో కాదు! అలాగే, మనం మరొకరి కింద పనిచేసే ఉద్యోగులం కావొచ్చు. అలాగని ఇంట్లో ఒదిగి ఉండక్కర్లేదు.. అలాగే, అక్కడ చూపించలేని ప్రతాపాన్ని ఇక్కడ చూపించకూడదు. కుటుంబసభ్యుల్ని మనతో కలిపి ఉంచేవి అనురాగబంధాలు కానీ, జీతభత్యాలు కావు. ఇది గుర్తుంచుకుని, ప్రేమాభిమానాల్ని ఇచ్చిపుచ్చుకుంటే ఇంటికీ ఆఫీస్‌కీ విభజన రేఖ స్పష్టంగా ఉంటుంది.
- ‘పని చేస్తుంటే పగలూరాత్రీ తెలియదు..’ అనుకోవడం బావుంటుందేమో.. కానీ అత్యవసరమైతే తప్ప ఆఫీస్ వర్క్‌ని ఇంటికి తీసుకురాకూడదు. అలాగే రాత్రిపూటా, వారాంతాల్లోనూ పని చేయడం అలవాటుగా మార్చుకోకూడదు. అలాగే ఇంట్లో కంప్యూటర్ ఉంది కదాని, నెట్ చూడటం, ఆఫీస్‌కు సంబంధించిన పనుల్ని తెముల్చుకోవడం వద్దేవద్దు!
- ఇంటికి చేరగానే, మీ భాగస్వామి ఆ రోజునెలా గడిపారో అడిగి తెలుసుకోండి.. ఏదో నిర్లిప్తంగానో, లేదా ఆరాలు తీస్తున్నట్టో కాదు! వాళ్లు చెప్పేది వినటం వల్ల మీలో ఆఫీస్ ఆలోచనలకు అడ్డుకట్ట పడుతుంది. పైగా, తమను పట్టించుకుంటారన్న భావన భాగస్వామిలో కలగడం ఓ ప్లస్ పాయింట్. (మన గురించి మనం మాట్లాడాలన్న తపన అందరికీ ఉండేదే. అయితే ఈ కాసేపు, మీగురించి చెప్పాలన్న వాంఛను అణుచుకోండి.)
- బాగా ఒత్తిడిగా ఉన్నప్పుడు, పనెక్కువ చేసిన తర్వాత, ఇంటికెళ్లడానికి ఎక్కువ దూరం, సమయం పట్టే మార్గాన్నెంచుకోవాలి. మొత్తం ప్రయాణం గంట పడుతుందనుకుంటే దాన్ని రెండు భాగాలుగా విభజించండి. ఒక సగంలో మర్నాడు చేయాల్సిన పనుల గురించి ఆలోచించండి. రెండో సగంలో పాటలు వినడం, లేదా మరేదైనా హాయినిచ్చే విషయాల గురించి అనుకోవాలి. దీనివల్ల లాభమేంటంటే ఇల్లు చేరేసరికి ఆఫీస్ ఆలోచనలు పూర్తిగా పక్కకు పోతాయి.
- చాలామందికి ‘నేను లేకుంటే ఆఫీస్ నడవదు..’ అన్న ధోరణి ఉంటుంది. నమ్మండి, నమ్మకపోండి.. అది పూర్తిగా తప్పు! ఏ కార్యాలయమైనా ఒక్కరి మీదే ఆధారపడి పనిచేయదు. అందువల్ల సమయం మొత్తం ఆఫీస్ పనికే ధారపోయడం.. అవసరం లేదు!
- దూరాల్ని చెరిపెయ్యడంలో సెల్‌ఫోన్‌ది కీలక పాత్ర. సెల్ మన అవసరానికి ఉపయోగపడేదే తప్ప, అదే ప్రాణావసరం కాకూడదు. వారంలో రెండు మూడు రోజులు సాయంత్రం 5 నుంచి మర్నాడు 5 వరకూ సెల్‌ఫోన్ వాడటం మానెయ్యాలి. సైలెంట్‌లో పెట్టడం లేదా స్విచాఫ్ చెయ్యడం.. దీనివల్ల పని గురించి ఆలోచించే సమయం తగ్గుతుంది!
(ఈనాడు లోని ఈతరం నుండి సేకరణ)
వెంకట రమణ చెప్పబడిన
ఇది ఈనాడు లోదనుకుంటా కదా, వారికి క్రెడిట్ ఇవ్వడమో, లేదా ఒక లంకెయ్యడమో చేస్తే బాగుంటుంది.
అశోక్ గార్ల చెప్పబడిన
థాంక్స్ వెంకట రమణ గారూ..ఇది ఈనాడు నుంచి తీసుకున్నదే. ఇప్పుడు కరక్ట్ చేసాను.నా బ్లాగ్ మొదలెట్టి 2 వారాలే అయ్యింది.
ఇప్పటివరకు అన్నీ నా సొంత టపాలు ఐనందు వల్ల, ఇది మిస్సైంది. ఇక నుండి అలా జరగకుండా జాగ్రత్త పడుతాను.
ఆల్ హ్యపీస్
Kesari చెప్పబడిన
ఇల్లు.. ఆఫీసు… ఇలా ఆల్ హ్యాపీసు!! శీర్షిక బాగుంది… ఈ కాలపు జీవనానికి అత్యవసరమయిన విషయమిది… మళ్ళీ గుర్తు చేసి మంచి పని చేశారు…
నవీన్ గార్ల చెప్పబడిన
సేకరణలు బ్లాగినా కూడా, సమయము ఉంటే…పైనా క్రిందా..అవసరమైన చోట్ల నీ వ్యాఖ్యలు ఉంచు…బాగుంటుంది.
Raj Phani చెప్పబడిన
భాబు ఆషొక్… కుంచం అప్పులవల్లను మరచె పొయె ఉపాయలు వుంతె చెప్పకూదధు? (మామగరి ధగ్గర కొంత ఆప్పు తీసుకున్నను)
Raj Phani చెప్పబడిన
ఆశొక్,
నెను సరధాగ… అన్నాను….నిజంగ నెను అనుకుంతునధె మీరు ఈ బ్లగులొ చెప్పరు…. ఛాలా భాగుంధి…
–రాజ్