ఏస్కో డిస్కో!!!

ఏస్కో డిస్కో
ఈల ఈల
ఏస్కో ఏస్కో
ఈల ఈల
డిస్కో ఏస్కో

నేను లండన్ లో ఉన్నా కాబట్టి మాచ్ ఆఫీస్ టైంలో జరిగింది.ఇంటెర్నెట్ లో స్కోర్ బోర్డ్ రెఫ్రెష్ చేస్తూ చూస్తున్ననంతే. 

ఏం టెన్షన్ రా బాబు. ముక్క్యంగా చివరి 4 ఒవర్లు.

16 ఒవర్ల వరకు గెలుస్తాం అనుకున్నాను.మరుసటి ఒవర్లో 3 సిక్సులు.పద్దెనిమిదవ ఒవర్లో 2 సిక్సులు. ఇక టెన్షన్ తట్టుకోలేక స్కొర్ బోర్డ్ విండోస్ అన్నీ మూసేసా.

ఆగలేక పోయా..పది సెకన్ల తర్వాత మళ్ళీ స్కొర్ బోర్డ్ తీసా. చూస్తే వికెట్లు పడ్డాయి కానీ చివరి ఒవర్ కి 13 రన్లు కొట్టాలి అంతే.

ఒక సిక్సు పడింది..పడంగానే ఐపొయిందిరా అనుకోని చుట్టుపక్కల వారికి ఓడిపొయాం అని చెప్పేసా. 

స్కొర్ బోర్డ్ రెఫ్రెష్ చెస్తే 3 నిముషాలైనా రానే లేదు. కొంచు దూరంలో వున్నతను వికెట్ పదిందీ అని కొంచం గట్టిగా అరిచాడు..

ఒక్క సారిగా టెన్షన్ పోఇంది. ఇండియా వరల్డ్ కప్ ఫైనల్స్ లో 24 ఏండ్ల తర్వాత అదే పాకి పైన గెలిచింది..  బలే బలే బలే బలే బలే ఆనందం అయ్యింది.

ఆల్ హ్యపీస్.. :-) ఏమంటారూ?

http://gsashok.wordpress.com/2007/09/22/india_aus_20-20_2007_semifinals/

అభిప్రాయములు »

  1. Avunandi..All Happies….inka konnalla varaku manam mana vallu ela Adinaa kuda chustune vuntamu…

  2. Shaik చెప్పబడిన

    నేను ఆఫిసులొ చూసాను. కాని .. ..LIVE… onlinecricketlive.blogspot.com

    nyways..MATCH….కేక.. కెవూ..

  3. ఆల్ హాపీస్… మీ TM అయినట్టుందే :)

  4. అశోక్ గార్ల చెప్పబడిన

    ప్రవీణ్, TM అంటే అర్థం ఏంటి?

  5. అశోక్ గార్ల చెప్పబడిన

    ఒకటి చెప్పేది మరిచిపోయా. ఫైనల్స్ ఐపొయిన రోజు, నేను లండన్ లో ఆఫీస్ నుంచి కాబ్ లో ఇంటికి వెళ్ళుతుంటే, లండన్ కాబ్ డ్రైవర్ నన్ను “నీ నేటివ్ ఎది అని అడిగాడు. ఇండియ అని చెప్పగానే, మీ ఇండియ పాకిస్తన్ ని వరల్డ్ కప్ లో ఓడించిందంట కదా? హ్యపీసా అని అడిగాడు. చాలా హ్యపీ 24 ఏండ్ల తర్వత వచ్చింది ఇలాంటి కప్ అని చెప్పా.

    ఇక్కడ విశేషం ఏమిటంటే, ఇంతవరకు నేను ఒక్క ఎంగ్లీషోడి దగ్గరా ఫుట్బాల్ తప్ప ఏది వినలేదు.
    అలాంటిది ఒక ఎంగ్లీషొడి దగ్గర క్రికెట్ గురించి అదీ ఇండియా పాకిస్తాన్ పై గెలిచింది అని వినగానే, చెప్ప లేనంత ఆనందమయ్యిందండి బాబూ.

  6. Idetrorce చెప్పబడిన

    very interesting, but I don’t agree with you
    Idetrorce

ఈ టపాపై వ్యాఖ్యలకు RSS ఫీడు · TrackBack URI

వ్యాఖ్యానించండి