కష్టాల్లో ఆదుకున్న ఇన్ ఫర్మేషన్!!!

కష్టం అని చూడగానే కంగారు పడ్డారా? ఇది పర్సనల్ లైఫ్ కి సంబందించింది కాదు.మన పనిలో వాడే యంత్రము “వొడిపైన” (laptop) / “లెక్కపెట్టే యంత్రము” (computer) కు 
సంబందించింది. ఇక ఊపిరి పీల్చుకోండి :) .

చాలా పని ఉన్నందు వల్ల, నిన్నటిరోజు ఆఫీసుకి త్వరగా వచ్చాను. లాగిన్ అవుదామని username password ఇస్తె, లాగిన్ అవదే! నీ యెంకమ్మ, నిన్నటివరకు, ఈ  user details నే కద వాడాను, దీనికి ఇప్పుడేమైందిరా నాయనా, అనుకున్నా. 

ఒక పక్క పని వుంది, లాగిన్ అవలేక పోతున్నా… నేను అడ్మిన్ యూసర్ డీటేల్స్ వాడేదాని వల్ల, పుండు పైన కారం చల్లినంత పెద్దదయ్యింది ఈ ప్రొబ్లెం.అబ్బబ్బ, ఒక్క క్షణం కొంత చిరాకేసింది.   

చిరాకేస్తే ఏం ప్రయోజనం, మన కోసం టైం ఆగదు కదా! ఎప్పటికైన ఈ ప్రొబ్లెం సాల్వ్ చేయాల్సిందే.తప్పదు. సాల్వ్ చేస్తేనే పని జరుగుతాది.కాబట్టి, ఆ చిరాకుని క్షనంలో చేదిచ్చి సాల్వ్ చేయడం స్టార్ట్ చేసా.

అందరిలాగే నాకు కూడా మా కంపనీ,  టెక్మహీంద్ర, ఒక లపటప :-) (laptop) ఇచ్చింది.పని పైన ఒక నెల కొసం లండన్లో వున్న మా క్లయంట్ ఆఫీసుకు వచ్చాను.తెల్లవారి జామున తొందరగా వచ్చాను కాబట్టి, ఆఫీస్లో హెల్ప్ చేసేవారు ఎవ్వరూ లేరు.

సో,క్లయంట్ ఆఫీస్ నుంచి మా ఇండియ ఆఫీస్లో వున్న సిస్టం అడ్మినిస్ట్రేటర్ కి ఫోన్ చేసాను.

అతనికి తెల్సిన సొల్యూషన్స్ అన్నీ చేయమని చెపాడు.’temp’ యూసర్తో లాగిన్ అయ్యి,కంట్రొల్ పానెల్, యూసర్ అకౌంట్స్, మై కంప్యుటర్ అన్నిట్లోకి వెళ్ళి వాటి ప్రొపెర్టీసన్నిటినీ గెలికాము. ప్రయొజనం లేకపోయింది.

నెట్ మీటింగ్లోకి వెళ్తే చూస్తానన్నడు. కుదరలేదు. లాస్ట్ కి నా మేయిల్స్ వున్న పీయస్టీ ఫైల్ (pst file) కాపీ చేస్కోగలిగను.కానీ మైక్రొసాఫ్ట్ ఔట్లుక్ సెట్టింగ్ చేసుకోవాలి.నేను చూసుకుంటానులే అని మా అడ్మినిస్ట్రేటర్కి చెప్పి ఫోన్ పెట్టేసాను.    
 
నేను client ఆఫీస్లో వున్నాను కాబట్టి, నా  mails చూసుకూవాలంటే ఒక స్పెషల్ ఫైల్ డవున్లోడ్  చేసుకోవాలి.ఎందుకో అప్పుడు ఆలింకు పనిచేయలేదు.

ఇదంతా అయ్యేకొద్ది దాదాపుగా ఒకటిన్నర గంట పట్టింది.

వెంటనే మా స్నెహితుడు రాజ్ కి ఫోన్ చేసాను. చిటికలో నా ప్రొబ్లెం సాల్వ్ చేసాడండి. నా పాస్వర్డ్ తెచ్చుకోగలిగాను.  రాజ్, యు ఆర్ ఎ సూపర్ బాయ్!! మీ సొల్యుషన్ పనిచేసిండి అని మేఇల్ చేసాను. ఆల్ హాపీస్… 

ఆ టెక్నిక్ ఏమంటే, వారానికి లేదా పదిహేను రూజులకు ఒక సారి “system restore point” క్రియేట్ చెసుకుంటె చాలా ఉపయోగపదుతుంది. ఇంత మాంచి option ఇచ్చాడు మైక్రొసాఫ్ట్ వాడు!! ఏంటి నమ్మరా?  :-) ఐతే మీ ఇష్టం, నాకైతే చాలా బాగా పనిచేసింది. నమ్మినవాళ్ళు కింద ఇచ్చిన సూచనలు ప్రకారం చెస్తే, ఇలాంటి కష్టం ఎప్పుడు వచ్చినా, చాలా తేలికగా సాల్వ్ చేసుకోవచ్చు.
start > All Programs > Accessaries > System Tools > System Restore > you get 3 options (i) Restore my computer to an earlier time (ii) Create a Restore point (iii) Undo my last restore point.

ఫస్టు, Create a Restore Point ను సెలెక్ట్ చెసుకొని, ఒక పెరు ఇచ్చి నెక్స్ట్ బటన్ని క్లిక్కండి. మీ Restore Point Create అయిపొఇనట్టే. ఇక ఎలాంటి ప్రొబ్లెంస్ వచ్చినా

ఆల్ హాపీస్ :-) … ఏమంటారు?

గమనిక: ఈ restore point  వారం పదిరోజులకంతా డెలీట్ ఐపోతుంది.

అభిప్రాయములు »

  1. స్మైల్ చెప్పబడిన

    లపటప…అదిరింది!

  2. sheelu చెప్పబడిన

    chaala bagundhi

ఈ టపాపై వ్యాఖ్యలకు RSS ఫీడు · TrackBack URI

వ్యాఖ్యానించండి