బరువు తగ్గాలంటే కష్టం కాని, బరువు పెరగాలంటే చాలా సులువు. http://gsnaveen.wordpress.com/2007/08/11/tips_for_obesity లో వ్రాసిన పది పాయింట్లకు వ్యతిరేకం చెస్తే సరి
, ఏమంటారు?.
ఇలా చెప్పినంత సులువు కాదులెండి.నాకు ఇది బాగా తెలుసు ఎందుకంటే నేను ఉద్యోగంలో చేరిన తర్వాత నాకు ఇద్దరు స్నెహితులు తగిలారండి. ఇద్దరూ తెలుగువారే. ఇద్దరికీ ఒకటే ప్రొబ్లెం, వుండవలసిన బరువుకంటే తక్కువ బరువు వుండటం.ఎంత తిన్నా లావు కాక పోవడం.
ఇద్దరి నడవడికలు దాదాపుగా ఒకటే అంటే నమ్మండి. బాచ్లర్ గా వున్నప్పుదు వీరితో 2 సంవత్సరాలు వున్నాను కాబట్టి వారిని చూసి నాకు (లావు పెరగాలంటే) అర్థం అయ్యింది ఇది:
- ఎప్పుడూ ఎక్కువగా టెన్షన్ ఫీల్ అవకూడదు.నా స్నెహితులకు ఏ చిన్నదానికైన చాలా టెన్షన్ ఫీల్ అయ్యేవారు.
- కారం నొర్మల్ గా తినాలి. నా స్నెహితులకు భోజనానికి పచ్చి మిరపకాయలు లేనిదీ అన్నం దిగేదికాదు.
- స్వీట్లు బాగా తినాలి.
- పచ్చడి (ఉరగాయ) నొర్మల్ గా తినాలి. ప్రతిసారి భోజననికి 5 – 6 ఉరగాయ ముక్కలు తినడం లాంటివి చేయకూదదు.
- చిన్నవాటికంతా ఎక్కువ ఆలొచించకూడదు.
నెను అర్థం చెసుకున్నంత వరకు బరువు తక్కువ ప్రొబ్లెం కొంచం మైండ్ రిలేటెడ్ అనిపిస్తుంది.
ఒక స్నేహితుడు మాత్రం పెళ్ళి ఐన సంవత్సరానికి కొంచం లావయ్యాడు
chavakiran చెప్పబడిన
Welcome Abode!
ప్రవీణ్ గార్లపాటి చెప్పబడిన
బ్లాగు లోకానికి స్వాగతం. మీ బ్లాగులో మొదటి వ్యాఖ్య నాదే
నాగరాజా చెప్పబడిన
ఈ మధ్యనే చదివాను కారం ఎక్కువగా తినడం వల్ల బరువు పెరగమని, నీళ్ళు కూడా ఎక్కువగా తాగుతామని!
నంద చెప్పబడిన
స్వాగతం ! సుస్వాగతం !! అశోక్ గారు….
మేధ చెప్పబడిన
బ్లాగ్లోకానికి స్వాగతం…
హ్హహ్హ.. బావున్నాయండీ మీ సలహాలు, సూచనలు.. పాపం తోటరాముడు గారి స్నేహితుడు “దినకర్(http://thotaramudu.blogspot.com/)” ఎలా బరువు పెరగాలా అని ఆలోచిస్తున్నాడట… !!
అతనికి పంపించండి…
jtammana చెప్పబడిన
బాగా చేప్పారు
ఆశా లత గార్ల చెప్పబడిన
బాగున్నాయి మీ సలహాలు.నేను ఒక సలహా ఇస్తాను ఏమిటంటే కాఫీ లూ
టీ లూ తగ్గించండి ..ఎంధు కంటె కాఫీ లూ టీ లూ ఆకలిని తగ్గిస్తాయి.
అశోక్ గార్ల చెప్పబడిన
ప్లేసెంట్ సర్ప్రైస్ ఇచ్చిందండి మా ఆవిడ, ఆశా లత.
నేను ఇప్పుడు లండన్ లో ఉంద్యొగపు పనిపైన ఒక నెల కొసం వచ్చాను.నా బ్లాగు చూడు అని ఫోన్లొ చెప్పాను అంతే, 2 గంటల తర్వాత చూస్తే, నా సలహాలకు మా ఆవిడ ఒక మంచి సలహా తగిలిచింది.
ఇది చూసి నేను, మా తమ్ముడు (నవీన్ గార్ల) చాలా హ్యపీగా ఫీల్ అయ్యాము.
నేను జస్ట్ మా బ్లాగులూ మరియు లెఖిని.ఆర్గ్ లింకులు పంపానంతే, అన్నీ తనే చూసి చెసిందండి.
అది నాకు సర్ప్రైసు మరియు ఆనందమూను
ఆల్ హ్యాపీస్…
రానారె చెప్పబడిన
ఔను. ప్రతి ‘చిన్నదానికీ’ టెన్షను ఫీలయితే కష్టమే! టెన్షను పెట్టే చిన్నది ఒక్కటుంటేనే భరించడం కష్టమని వివాహిత మిత్రులంతా ఏక కంఠంతో రోజూ చెబుతూనే ఉంటారు. అందరూ “అన్న బ్లాగురాస్తే మాస్” అంటూంటే విని ఏందో అనుకన్నా.
madhu చెప్పబడిన
bagunnaei mee salahalu
bhuvan చెప్పబడిన
nenu chala sannaga unnanu