మీ స్వాగతం పలుకులు చాలా ఆనందాన్ని ఇస్తున్నాయి.చిరంజీవి తనతో పాటూ డాన్స్ చేసే చాన్స్ ఇచ్చినంత ఆనందంగా వుంది.అసలు నా ఆనందం వర్ణిచాలంటే నాకు పదాలు రావట్లేదు.అందరికీ చాలా థాంక్స్ అండి.
ఈ క్రెడిట్ అంతా మా తమ్ముడు నవీన్ ది.థాంక్స్ రా తమ్ముడు.
ఇప్పుడు అర్థం అవుతావుంది మా తమ్ముడు ఎప్పుడూ బ్లాగ్ బ్లాగ్ వికి వికి అని ఎందుకు అనేవాడూ అని. రసగుల్లా కంటే తీయగా ఉండే ఈ బ్లాగు, బ్లాగు మిత్రులను ఇలా కల్సుకున్నందుకు చాలా హ్యపీ గా ఉంది.
ఎప్పుడూ అందరినీ అన్నింటిలోనూ ప్రొత్సహిచ్చే వ్యక్తిత్వం వున్న నాకు, త్తమ్ముడు మరియు మీ అందరి కామెంట్స్ చాలా ఉత్సహాన్ని, ప్రోత్సాహాన్ని ఇస్తోంది.
జీవితంలో ఎప్పుడూ ఎలాంటి సందర్బంలొనైనా హ్యపీగా ఉండాలనే తత్వం వున్న నాకు చాలా హ్యపీగా ఉంది.
solarflare చెప్పబడిన
best of luck and always be happy.
రాజు సైకం చెప్పబడిన
తెలుగు బ్లాగ్ ప్రపంచానికి స్వాగతం…..సుస్వాగతం…
ఇంతకీ మీ తమ్ముడు ఎవరో ( అతని బ్లాగ్ లింక్ ) చెప్పలేదు!!
http://www.tenugublog.com/mudra
నవీన్ గార్ల చెప్పబడిన
అదే బ్లాగడంలో ఉన్న సిసలైన మజా. ఇక్కడ టపా వ్రాసిన ప్రతిసారి, ఎంతో మంది మిత్రులు చదివి తమ వ్యాఖ్యల ద్వారా పలకరిస్తారు. ఎదుటివారికి నేరుగా చెప్పలేని ఎన్నో భావాలు, అభిప్రాయాలు ఇక్కడ హాయిగా వ్రాసుకోవచ్చు. వ్యక్తిత్వ వికాసపు చిట్కాలో లేక చిన్నప్పుటి సంఘటనలు లేక స్కూల్లోని తీపిగురుతులు ఏవైనా సరే బ్లాగచ్చు. చెప్పాను కదా అని ఇవే వ్రాయనవసరం లేదు, నీకు తోచింది ఏదైనా బరకచ్చు
cbrao చెప్పబడిన
అశోక్ -మీరు తెలుగులో రాయాడం ఆనందం మా అందరికీ. మీ పేరులో s అంటే ఏమిటి? ఇప్పుడు ఎక్కడున్నారు? ఏం చేస్తున్నారు? మదనపల్లె లో మీ బాల్యం గురించిన ముచ్చట్లు మాతో పంచుకోగలరా?
radhika చెప్పబడిన
స్వాగతం…..సుస్వాగతం
అశోక్ గార్ల చెప్పబడిన
మళ్ళీ మీరందరూ ఇంకొక థాంక్స్ పుచ్చుకోండి
మా తమ్ముడి పేరు నవీన్. అతని బ్లాగ్ http://gsnaveen.wordpress.com
కరెక్టే నవీను!! మాజా తాగేకన్నా బ్లాగడంలోనే ఉంది సిసలైన మజా
…
రావ్ గారూ, gsashok లో ఉన్న మొదటి s మా నాన్న గరి పేరు, సురేంద్ర గుప్త. g అంటే మా ఇంటి పేరు,గార్ల.
ఇప్పుడు ప్రొజక్ట్ పనిపైన ఒక నెల కోసం లండన్ వచ్చాను. పూణే బేస్డ్ కంపని టెక్మహీంద్ర లో ప్రొజక్ట్ మేనేజర్ (తెలుగులో ఏమంటారో?) గా పని చేస్తున్నాను.
తప్పకుండా నా బాల్యం ముచ్చట్లు పంచుకుంటానండి.
Vihaari(KBL) చెప్పబడిన
బ్లాగ్లోకానికి సుస్వాగతం